ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజన అంశం కొద్దిరోజులుగా తెర మీదికి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో 13 జిల్లాల 26 గా విభజించారు. అయితే అప్పట్లో ప్రజల అభిప్రాయాలను పట్టించుకోలేదని చాలామంది అసంతృప్తిని తెలియజేశారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మండలాల వారిగా, గ్రామాలలో అభిప్రాయాలను సేకరించి  సరిహద్దుల పేర్లు మార్పు సర్దుబాటు పైన  ప్రత్యేకించి 7 మంది మంత్రులను నియమించి వీటి పైన నివేదికలు ఇవ్వాలి అంటూ సూచించింది ఏపీ ప్రభుత్వం. జిల్లాల కలెక్టర్లలో ఈ అర్జీలను తీసుకుంటారు. వీటి పైన త్వరలోనే ఒక నివేదికను కూడా ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం.



2025 డిసెంబర్ 31లోగా ఆంధ్రప్రదేశ్లో ఉండే మండలాలు గ్రామాల సరిహద్దుల పేర్లను మార్చేలా చూస్తున్నారు. ఆ తర్వాత జనగణన నేపథ్యంలో మార్చే అవకాశం ఉండదు.

కొత్త జిల్లాల ప్రతిపాదన:

1).ప్రకాశం జిల్లాలో మార్కాపురంను కొత్త జిల్లాల ప్రతిపాదన చాలా కాలం నుంచి ఉంది .గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి వంటి 5 నియోజకవర్గాలలో ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేసే విధంగా పరిశీలిస్తున్నారట.

2).అలాగే బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలో ఉండే కందుకూరు నియోజవర్గాన్ని కూడా తిరిగి మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపడం వల్ల అక్కడ ప్రజలకు  అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుంది. వీటిని ప్రకాశంలోకి తీసుకువస్తే..ఒంగోలు, కొండపి, సంతనూతలపాడుతూ కలిపి మొత్తం మీద 5  నియోజవర్గాలు అవుతాయి.ఈ రెండు జిల్లాలు సమానంగానే ఉంటాయి.

3).ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి పరిధిలో 29 గ్రామాలు గుంటూరు జిల్లా, మంగళగిరి, తాడికొండ నియోజవర్గంలోకి వస్తాయి కనుక.. వీటితోపాటుగా జగ్గయ్యపేట, పెదకూరపాడు, నందిగామ వంటి నియోజకవర్గలు అమరావతి ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి. అందుకే వీటిని కొత్త అర్బన్ జిల్లాలుగా ఏర్పాటు చేస్తే 5 నియోజకవర్గాలు గా మారే అవకాశం ఉన్నది.

4).గుంటూరు జిల్లాలోని.. గుంటూరు తూర్పు, పత్తిపాడు, పశ్చిమ, పొన్నూరు, తెనాలి వంటివి కలిపి 5 నియోజకవర్గాలవుతాయి.


5).అలాగే ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలన్నీ కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అవకాశం ఉన్నది. ఈ రెండు నియోజకవర్గాలు ప్రస్తుతం విజయవాడ నగరంలో కలిసి ఉన్నాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ పశ్చిమ, తూర్పు, మధ్య, మైలవరం, తిరువూరు, గన్నవరం, పెనమలూరు తో సహా 7 నియోజకవర్గాలుగా అవుతాయి. కృష్ణాజిల్లాలో కేవలం అప్పుడు 5 నియోజకవర్గాలు  ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.


అలాగేరంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు వెళ్లాలి అంటే 187 కిలోమీటర్లు పైగా ప్రయాణించాలి. దీనివల్ల అటు ప్రభుత్వానికి అధికారులకు కూడా పాలనపరంగా ఇబ్బంది ఉండడంతో. రంపచోడవరం డివిజన్ తో పాటుగా చింతూరు డివిజన్లోని ఉండే 4 విలీనమైన మండలాలను కలిపితే అక్కడ ప్రత్యేకించి ఒక జిల్లాను ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల ప్రజలకు కూడా చాలా సౌకర్యంగానే ఉంటుంది.


అయితే తెరమీదికి కొత్తగా వచ్చిన ప్రతిపాదనలు ఏమిటంటే:

1).మండపేట నియోజకవర్గం తూర్పు జిల్లాలలో విలీనం చేయాలి.

2).కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాలో కలపాలి.

3).శృంగావరపుకోట నియోజవర్గాన్ని విశాఖపట్టణంలో కలపాలి.

4).మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరిలో కలపాలి.

5).రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో చేర్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: