ఇటీవల కాలంలో సినీ ప్రేక్షకులకు నిజంగా ఒక పెద్ద విజువల్ ట్రీట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ మధ్యలో బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్‌తో తీసిన చిత్రాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. స్టార్ హీరోలతో, స్టార్ డైరెక్టర్లతో, విదేశీ లొకేషన్స్‌లో షూటింగ్స్ జరిపి, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. అయితే ఆశ్చర్యకరంగా, ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా, పెద్దగా ప్రమోషన్స్ కూడా లేకుండా విడుదలైన కొన్ని చిన్న సినిమాలు మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తూ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ చిన్న సినిమాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం.


లిటిల్ హార్ట్శ్:
మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా లిటిల్ హార్ట్స్. ఈ సినిమాలో పెద్ద స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్‌లు ఎవరూ లేరు. కానీ మంచి కంటెంట్‌తో, రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన మౌళి తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. '90శ్ వెబ్ సిరీస్ ద్వారా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మౌళి, ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. పెద్దగా అంచనాలు లేని ఈ చిత్రం, వారం రోజుల్లోనే భారీ విజయాన్ని సాధించి, సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. కంటెంట్‌కి, నటీనటుల పెర్ఫార్మెన్స్‌కి వచ్చిన ప్రశంసలు ఈ సినిమాని ప్రేక్షకుల మదిలో నిలిపాయి.



మీరాయి:
తదుపరి చిత్రం మీరాయి. యువ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. 'పాన్ ఇండియా' హీరోలుగా పేరుగాంచిన వారు కూడా ఈ స్థాయి హిట్‌ను అందుకోలేకపోయారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తేజ సజ్జ ఈ చిత్రంతో తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఈ సినిమా కోసం ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ అని, కేవలం మంచి కథ కోసం, తన కెరీర్‌ను బలోపేతం చేసుకోవడానికి మాత్రమే సినిమాలను ఎంచుకుంటున్నాడని అభిమానులు చెబుతున్నారు. తక్కువ బడ్జెట్‌లో తీసినా ఈ సినిమాని తేజ తన భుజాలపై ఎక్కించుకుని విజయవంతం చేశారు. ఇది కంటెంట్‌కే ప్రాధాన్యం ఉంటుందని మరోసారి రుజువైంది.



కిష్కిందపూరి:
మూడవ సినిమా కిష్కిందపూరి. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ నటించారు. హారర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ ముందు మంచి హైప్ సృష్టించింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, "సినిమా మొదలైన పది నిమిషాల తరువాత ఎవరూ తమ మొబైల్ ఫోన్స్ పట్టుకోలేరు" అని ఓపెన్ ఛాలెంజ్ విసరడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఈ సినిమాకి మిక్స్‌డ్ రివ్యూస్ ఇచ్చారు. కలెక్షన్ల పరంగా పెద్ద సక్సెస్ కాకపోయినా, "థియేటర్లో ఒకసారి చూడదగిన సినిమా" అని మంచి మాటలు అందుకుంది. ఈ జానర్‌కు ఉన్న అభిమానుల కోసం హారర్ అనుభూతి బాగా పండిందని సినీ ప్రేమికులు చెబుతున్నారు.



సినీ ఇండస్ట్రీకి సిగ్నల్
ఈ మూడు సినిమాలు సినీ రంగంలోని పెద్దలకి ఇచ్చే పెద్ద పాఠం ఏమిటంటే, భారీ బడ్జెట్ ఖర్చు చేసి, విదేశీ లొకేషన్స్‌కి వెళ్లి, అతి ఆధునిక VFX కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కంటెంట్ బలంగా ఉంటే, ప్రేక్షకులు ఏ సినిమాకైనా చప్పట్లు కొడతారు, హిట్ చేస్తారు. కేవలం మంచి కథ, నిజజీవితానికి దగ్గరగా ఉండే ప్రెజెంటేషన్ ఉంటే ప్రేక్షకులు ఆ సినిమాని విజయవంతం చేస్తారు అని ఈ మూడు సినిమాలు మరోసారి నిరూపించాయి. ఇప్పుడు పెద్ద నిర్మాతలు, దర్శకులు ఈ సినిమాల నుండి ప్రేరణ తీసుకుని తమ భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: