నిన్న బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ఒకటి తేజ సజ్జా హీరోగా నటించిన మీరాయి సినిమా.  మరొకటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి నటించిన కిష్కిందపురి. ఈ రెండు సినిమాలూ రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను సృష్టించుకున్నప్పటికీ, ఫలితం మాత్రం కాస్త విభిన్నంగా కనిపించింది. మీరాయి సినిమాపై డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని యొక్క స్టైలిష్ డైరెక్షన్, పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్, తేజ సజ్జా పెర్ఫార్మెన్స్— ఒక సెన్సేషనల్ లెవెల్ సక్సెస్‌ని సాధించాయి. దీంతో ఆడియన్స్ అటెన్షన్ మొత్తం మీరాయి వైపు మళ్లిపోయింది. ఈ ప్రభావం కిష్కిందపురిపై స్పష్టంగా పడింది.


హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన కిష్కిందపురి కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ, సినిమా పై టాక్ మాత్రం మిక్స్‌డ్‌గా ఉంది. సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేసినా, ఆ ప్రమోషన్ వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. సినీ విమర్శకులు చెబుతున్నట్లు, ఈ సినిమా సోలో రిలీజ్ అయ్యి ఉంటే రిజల్ట్ కాస్త బెటర్‌గా ఉండేదేమో కానీ, మీరాయి వంటి భారీ హిట్ మధ్యలో రావడం వల్ల ఈ సినిమాకు ఊహించిన స్థాయి దక్కలేదు. బాక్సాఫీస్ వసూళ్లను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు కిష్కిందపురి సినిమా సుమారు ₹1.25 కోట్ల షేర్ మార్క్‌ను టచ్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలిపి మొత్తం షేర్ మాత్రం ₹1.8 కోట్ల రేంజ్‌ను మాత్రమే అందుకుంది. ఈ స్థాయి వసూళ్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అభిమానులను నిరాశకు గురి చేశాయి. ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నట్లు, మేకర్స్ ఊహించిన స్థాయికి ఈ సినిమా వసూళ్లు ఏ మాత్రం చేరలేదు.



వీకెండ్ లో సినిమాకు మరికొంత పెరుగుదల ఉండవచ్చని ట్రేడ్ అనలిస్ట్‌లు చెబుతున్నారు. కానీ భారీ రికార్డులు సృష్టించే స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం లేదు అని విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా పై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. "బెల్లం బాబు ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటి, రిజల్ట్ మరోలా వచ్చింది" అంటూ జనాలు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద, కిష్కిందపురి సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు పెద్ద షాక్ ఇచ్చినట్టే. వచ్చే రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!!?

మరింత సమాచారం తెలుసుకోండి: