
ఇటీవలే ఏపీ ప్రభుత్వం 4,687 అంగన్వాడీలను మెయిన్ అంగనవాడి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసి ఉత్తరులను జారీ చేసింది. ఇప్పుడు వాటిలోనే 4,687 అంగన్వాడి సహాయక పోస్టులను సైతం భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీలైనంత త్వరగా వీటినియమాకాయలను భర్తీ చేయపట్టాలని.. మహిళా శిశు సంక్షేమ అధికారులకు నిన్నటి రోజున ఆదేశాలను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మీనీ అంగన్వాడి కార్యకర్తలకు పదోన్నతిని కల్పించింది ఏపీ ప్రభుత్వం. అలా పదవ తరగతి పాస్ అయిన 4,687 మందిని మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడి కార్యకర్తలుగా మార్చారు.
వీరికి ఇప్పుడు ప్రతినెల రూ.11,500 రూపాయలు గౌరవ వేతనం కింద ఇస్తున్నారు.4,687 అంగన్వాడి సహాయక పోస్టులకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో మహిళలు తమ సొంత ఊర్లలోనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు:
అంగన్వాడి సహాయక పోస్టులకు పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
2). మహిళ అభ్యర్థులు పెళ్లి అయి స్థానిక వ్యక్తులై ఉండాలి
3). వయస్సు 01-7-2025 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.. ఎస్సీ, ఎస్టీ ప్రాంతంలో గల వారు 18 సంవత్సరాలకే అర్హులు.
4).అంగన్వాడి కార్యకర్త లేదా అంగన్వాడి సహాయక పోస్టులకు..ఎస్సీ, ఎస్టీ ప్రాంతంలో వారు మాత్రమే అర్హులు.
5). అభ్యర్థులు దరఖాస్తుతో పాటుగా క్యాస్ట్(బీసీ, ఎస్సీ, ఎస్టీ), పదవ తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించిన పత్రం.
6). ఈ దరఖాస్తులను పోస్ట్ బాక్స్ లేదా స్వయంగా ఆయన అందించవచ్చు. పూర్తి వివరాలు కోసం దగ్గరలో ఉండే స్థానిక అధికారులను సంప్రదించాలి.