తమిళ సినీ పరిశ్రమలో పండుగ సీజన్లలో సినిమాల మధ్య పోటీ కామ‌న్‌. మ‌రీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో టాప్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే అక్కడి వాతావరణం మరింత రసవత్తరంగా మారుతుంది. అభిమానుల ఉత్సాహం, బుకింగ్స్, రికార్డుల పోరు అన్నీ కలగలిపి పండగ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తాయి. ఈసారి సంక్రాంతి బరిలోకి రావాలని నిర్ణయించిన హీరో సూర్యకి మాత్రం ఆ పోటీ పెద్ద తలనొప్పిగా మారింది. అస‌లే కెరీర్ ప‌రంగా స‌రైన హిట్ కోసం ఇబ్బందులు ప‌డుతోన్న సూర్య‌కు వ‌చ్చే సినిమా విజ‌యం కీల‌కం అయినా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.


సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు ఈ సినిమా విజ‌యం చాలా చాలా ఇంపార్టెంట్‌. మళ్లీ తన కెరీర్‌ను ట్రాక్ ఎక్కించాలంటే ఈ సినిమాకు మంచి రిసెప్షన్ రావాలి. అందుకే మొదట పొంగల్ సీజన్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. పండుగ సీజన్‌లో థియేటర్లలో ఉన్న డిమాండ్, ఫ్యామిలీ ఆడియన్స్ రష్ సూర్య సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని భావించారు.
ఇప్పుడు అంచనాలు తారుమారయ్యేలా ఉన్నాయి. విజయ్ నటించిన ‘జన నాయగన్’ జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. విజయ్ సినిమాలకు తమిళనాడులో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అలాంటి సమయంలో ఆయన సినిమా రావడం అనేది బాక్స్ ఆఫీస్ వద్ద మిగతా సినిమాలకు గట్టి సవాలు అవుతుంది.


తాజాగా శివకార్తికేయన్ కూడా తన కొత్త చిత్రం  పరాశక్తి జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ ఇద్దరు హీరోల సినిమాలే బాక్స్ ఆఫీస్‌ను నిండుగా ఆక్రమించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సూర్య కరుప్పు ని అదే సీజన్‌లో రిలీజ్ చేస్తే పెద్ద రిస్క్ అవుతుందని ఆయన టీమ్ భావిస్తోంది. ఇప్పటికే వరుస పరాజయాలతో ఇమేజ్‌ దెబ్బతిన్న పరిస్థితిలో, ఈ స్థాయి పోటీలోకి వెళ్లి మళ్లీ విఫలమైతే సూర్యకు పెద్ద దెబ్బ తగలడం ఖాయం. అందుకే ఇప్పుడు ఆయన, ఆయన టీమ్ సంక్రాంతి రిలీజ్‌ను వదిలేసి సమ్మర్ సీజన్ వైపు మొగ్గు చూపుతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: