టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ కూడా ఈమధ్య బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ప్రభాస్ కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచిన చిత్రం కల్కి 2898AD . ఈ సినిమాతో రూ .1000 కోట్ల క్లబ్ లోకి మరొకసారి చేరారు ప్రభాస్. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా మహాభారత నేపథ్యం ఉన్న కథతో తెరకెక్కించిన ఈ చిత్రంలో చాలామంది నటీనటులు నటించారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, బ్రహ్మానందం, ఆర్జీవి, శోభన, అమితాబచ్చన్, కమలహాసన్ తదితర నటీనటులు కనిపించారు.


అలాగే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. తాజాగా కల్కి సినిమా మేకర్స్ ఒక షాకింగ్ అప్డేట్ ని అందించారు. కల్కి సీక్వెల్లో దీపికా నటించడం లేదంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేశారు.. ఈ మేరకు వైజయంతి మూవీస్ బ్యానర్ వారు ఒక ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.


ఇది మా అధికారికంగా ప్రకటన దీపికా పదుకొనే రాబోతున్న కల్కి సీక్వెల్ నటించదు.. దీనిపైన చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె కమిట్మెంట్ (కేవలం రోజుకి 8 గంటలే పని చేస్తా) వంటి కండిషన్స్ పెట్టడం వల్ల ఈ సినిమాకి అవి సరిపోదు దీంతో ఆమెను కొనసాగించలేకపోతున్నామంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. గతంలో కూడా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రం కోసం దీపికా ని మొదట సంప్రదించగా ఆమె చాలా కండిషన్స్ పెట్టడంతో అది నచ్చకపోవడంతో ఆమెను సినిమా నుంచి తప్పించారు. ఆ సమయంలో కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు కల్కి సినిమా సీక్వెల్ లో కూడా దీపికాను తప్పిస్తూ చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేసింది. మరి ఈ విషయంపై దీపికా ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: