
ఇక షోలు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న తేడా అభిమానుల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చి, సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 9:40 గంటలకే ప్రీమియర్ షోలు ప్రారంభం కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాస్త కఠినంగా వ్యవహరించి, రిలీజ్ డే అర్ధరాత్రి 1 గంట తర్వాతే మొదటి షో వేసుకోవడానికి మాత్రమే అనుమతులు ఇచ్చింది. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఏపీలో అలా ఎందుకు పరిమితులు విధించారు? అనే ప్రశ్నలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు న్యూట్రల్ ఆడియన్స్‌లో కూడా వినిపిస్తున్నాయి.అయితే ఈ గ్యాప్‌ని తగ్గించడానికి ఏపీలోని కొన్ని థియేటర్లు తెలంగాణ పద్ధతినే అనుసరించాలని నిర్ణయించుకోవడం పవన్ కళ్యాణ్ అభిమానులకు చిన్న ఊరట ఇచ్చింది. దీంతో ఏపీలో కూడా కొన్ని చోట్ల 9:40కే షోలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయం విన్న అభిమానులు మరింత ఉత్సాహంగా ముస్తాబవుతున్నారు.
మొత్తానికి “ఓజీ” సినిమా రిలీజ్ విషయంలో ఎక్కడా అభిమానులు తగ్గడం లేదు. సోషల్ మీడియాలోనైనా, థియేటర్లలోనైనా పవర్‌స్టార్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అన్ని వైపులా ఏర్పడుతున్న ఈ విపరీతమైన అంచనాలు నిజమైతే, బాక్స్ ఆఫీస్ వద్ద అసలు రికార్డులు మిగలవు అన్నది ఇండస్ట్రీ టాక్. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కాకుండా మొత్తం తెలుగు సినిమా చరిత్రలో “ఓజీ” అనే పేరు ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ గూస్ బంప్స్ మూమెంట్ కి కేవలం ఇక కొద్ది గంటలే మిగిలి ఉంది..!!