
ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఈ సినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టింది. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన జిల్లా నెల్లూరు. ఇక్కడి బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ మరోసారి తన స్ట్రాంగ్ బేస్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రీమియర్స్‌తో కలిపి ఓజీ మొదటి రోజే 2.13 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇది పవన్ కెరీర్‌లోనే కాకుండా నెల్లూరు జిల్లా రికార్డుల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. టాప్ 10 లిస్ట్‌లో ఎంట్రీ .. ఈ భారీ వసూళ్లతో “ఓజీ” నెల్లూరులో టాప్ 10 ఓపెనింగ్స్‌లోకి ఎంటర్ అయింది. ఆర్ఆర్ఆర్, పుష్ప 2, సాహో, దేవర, ఆచార్య, బాహుబలి 2, సైరా, గేమ్ చేంజర్, వకీల్ సాబ్ వంటి బిగ్ మూవీస్ సరసన పవన్ సినిమా తన పేరు లిఖించుకుంది. పవన్ స్టైల్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను కట్టిపడేయడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ షోలు కనబరుస్తున్నాయి.
టాప్ 10 ఓపెనింగ్స్ – నెల్లూరు జిల్లా (షేర్ – కోట్లు)
* ఆర్ఆర్ఆర్ – 3.01
* పుష్ప 2 – 2.90
* సాహో – 2.56
* దేవర – 2.49
* ఆచార్య – 2.29
* **ఓజీ – 2.13**
* బాహుబలి 2 – 2.10
* సైరా – 2.09
* గేమ్ చేంజర్ – 2.00
* వకీల్ సాబ్ – 1.70
లాంగ్ రన్‌లో హవా కొనసాగుతుందా? .. దసరా సెలవులు దగ్గరగా ఉండటంతో పాటు, వారం చివరలో హాలిడే బూస్ట్ రావడం “ఓజీ”కు మరింత బలాన్నిస్తోంది. మాస్ ఏరియాల్లో పవన్ క్రేజ్ మరీ ఎక్కడికో వెళ్ళిపోతోంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన పెట్టుబడిలో 45% రికవరీ అయిందని సమాచారం. లాంగ్ రన్‌లో ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను దాటడం ఖాయం అని ట్రేడ్ టాక్. పవన్ పవర్ రిపీట్! .. మొత్తానికి, “ఓజీ”తో పవన్ కళ్యాణ్ మరోసారి తన మాస్ స్టామినాను ప్రూవ్ చేశాడు. టాక్ ఎలా ఉన్నా.. పవర్ స్టార్ కేరెక్టర్, స్క్రీన్ ప్రెజెన్స్, ఫ్యాన్స్ క్రేజ్ కలిపి సినిమాను బాక్సాఫీస్ వద్ద ఘన విజయవంతం చేసే దిశగా నడిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నెల్లూరుతో పాటు మొత్తం ఏపీ, తెలంగాణలో “ఓజీ” కలెక్షన్ల హవా కొనసాగనుంది.