పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారిపోయింది. టీనేజ్‌లోనే కెమెరా ముందుకు వచ్చిన ఈ హీరోయిన్ తన తొలి సినిమా ద్వారానే అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమాతోనే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ చందమామ అందగత్తె, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమె మరెవరో కాదు – అనుపమ పరమేశ్వరన్. 2016లో వచ్చిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమమ్’ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ, క్యూట్ లుక్స్‌తో ఆడియన్స్ హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో నితిన్, సమంతలతో కలిసి నటించిన ‘అఆ’ ద్వారా తెలుగు తెరపైకి అడుగుపెట్టింది.
 

అలా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, శర్వానంద్‌తో ‘శతమానం భవతి’, రామ్, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోల సరసన చేసిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అనుపమ కెరీర్‌లో ఒక పెద్ద మలుపు ‘కార్తికేయ 2’. ఈ సినిమా ఘన విజయంతో ఆమెను పాన్ ఇండియా ఆడియన్స్ గుర్తించారు. నిఖిల్ సరసన చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లడంతో, అనుపమ పాన్ ఇండియా బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇదే సమయంలో ‘బటర్ ఫ్లై’, ‘18 పేజీస్’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన ఒక విషయం ఏమిటంటే – ‘రంగస్థలం’ సి
నిమాలో మొదట హీరోయిన్‌గా అనుపమనే ఎంపికైనట్టు టాక్. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చివరికి ఆ స్థానం సమంతకి దక్కింది.
 

అయినా ఈ ముద్దుగుమ్మ తనకంటూ సొంత స్థానం సంపాదించుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఇటీవలే విడుదలైన ‘కిష్కంధపురి’ సినిమాలో నటించిన అనుపమకు మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ‘పరదా’, ‘జానకి వర్సెస్ కేరళ’ వంటి ప్రాజెక్టుల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా జానకి వర్సెస్ కేరళలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అనుపమకు మలయాళంలో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు, తమిళంలో కూడా మంచి ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. చూడచక్కని రూపం, ఉంగరాల జుట్టు, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే లుక్స్ – ఇవన్నీ ఆమెను యూత్ ఐకాన్‌గా మార్చేశాయి. మొత్తానికి కెరీర్ మంచి ఫాంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్, పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: