ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన అంశం అడవి శేష్  చేసిన కామెంట్స్. లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన, హీరో మౌళిని ప్రశంసిస్తూ కొంత ఘాటుగానే స్పందించారు. “ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే… ఒక హీరో ఎవరి సినిమా హిట్ అయినా సరే ఆ మూవీ టీంని తన ఇంటికి పిలిచి డిన్నర్ పార్టీ ఇస్తున్నాడు. అంతే కాదు, ఆ డైరెక్టర్‌తో వెంటనే నెక్స్ట్ సినిమా కూడా లైన్‌లో పెట్టేస్తున్నాడు” అంటూ ఆయన వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.


ఈ కామెంట్స్ అప్పట్లోనే చాలా హడావుడి చేశాయి. కానీ ఇప్పుడు మళ్లీ అదే విషయం సోషల్ మీడియాలో రీ-ఎంట్రీ ఇస్తూ పెద్ద దుమారం రేపుతోంది. ఎందుకంటే… తాజాగా దర్శకుడు సుజిత్ తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని సాధించాడు. ఆయన డైరెక్ట్ చేసిన “ఓ జీ” సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచి పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కొత్త రికార్డులు సృష్టించింది. ఇంత పెద్ద హిట్ అయినా కూడా అడవి శేష్ కామెంట్ చేసిన ఆ హీరో ఇప్పటివరకు సుజిత్‌ని తన ఇంటికి పిలిచి డిన్నర్ పార్టీ ఇవ్వలేదు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వేసే ప్రధాన ప్రశ్న.



“ఇతర హిట్స్ వచ్చినప్పుడు ఆ హీరో వెంటనే మూవీ టీంను ఇంటికి ఆహ్వానించి పార్టీ ఇస్తాడు. కానీ ఈసారి మాత్రం సుజిత్, ‘ఓ జీ’ టీంను పట్టించుకోలేదు. ఎందుకు? పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టినా? లేక అడవి శేష్  ఇటీవల చేసిన కామెంట్స్ వల్ల ఈసారి అలాగే చేస్తే మరింత ఇబ్బంది అవుతుందని అనుకుని జాగ్రత్త పడ్డాడా?” అంటూ నెటిజన్లు తర్జన భర్జన పడుతున్నారు. ఇక అభిమానులు అయితే మరో లెవల్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. “సుజిత్‌ని పిలవకపోవడం అంటే ఆయన హిట్‌ని గుర్తించకపోవడమే కదా..” అంటూ ప్రశ్నిస్తుంటే, మరికొందరు “ఇప్పుడే కాదు.. కొద్ది రోజుల తర్వాత ఓ గ్రాండ్ డిన్నర్ పార్టీ ఇస్తాడేమో.. అప్పుడే క్లారిటీ వస్తుంది” అంటున్నారు.



మొత్తానికి అడవి శేష్ చేసిన ఒక కామెంట్ మళ్లీ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. ఈ హీరో నిజంగా ఓజీ టీంను తన ఇంటికి పిలిచి డిన్నర్ పార్టీ ఇస్తాడా..? సుజిత్‌తో తదుపరి సినిమా ఛాన్స్ కూడా లైన్‌లో పెడతాడా..? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాకుండా అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: