దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ మిగతా భాషలలో కూడా అద్భుతమైన నటనతో పేరు సంపాదించింది. ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న కాజల్ తాజాగా బాలీవుడ్లో "ది ఇండియా స్టోరీ"  అనే చిత్రంలో సరికొత్తగా కనిపించబోతోంది. శ్రేయాస్ తల్పడే కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని చేతన్ డీకే దర్శకత్వం వహించారు.


ఇటీవల సినిమా షూటింగ్ కూడా పూర్తి అయినట్లుగా సమాచారం. కాజల్ తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను కూడా అభిమానులకు షేర్ చేస్తూ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందులో కాజల్ అగర్వాల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే వ్యవసాయం , జీవనాధారంగా ఉన్న రైతులు, పురుగు మందుల వ్యాపార కుంభకోణాల, వారు చేసేటువంటి అక్రమాల  మధ్య చుట్టూ తిరిగేటువంటి కథ అన్నట్లుగా  వినిపిస్తోంది. కాజల్ అగర్వాల్ ఇందులో రైతుల హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ఒక న్యాయవాది పాత్రలో కనిపించబోతోంది. మరి ఈ తరహా పాత్రలో గతంలో ఎప్పుడూ కూడా కాజల్ కనిపించలేదు. మరి ఈ పాత్ర అభిమానులను ఏ విధంగా ఆకట్టుకునేలా ఉంటుందో చూడాలి మరి.

అలాగే మురళీ శర్మ, మనీష్ వాద్వా  వంటి వారు ఇందులో కీలకమైన పాత్రల నటించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే రామాయణ, ఇండియన్ - 3 వంటి సినిమాలలో నటించబోతోంది. ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించడానికి మక్కువ చూపిస్తోంది కాజల్. మరి తెలుగులో ఎలాంటి చిత్రంతో మళ్ళీ అభిమానులను మెప్పిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: