టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న నటి మనులలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను చాలా సంవత్సరాల క్రితం మొదలు పెట్టింది. తెలుగు సినీ పరిశ్రమలో కెరీర్ ను మొదలు పెట్టిన తర్వాత చాలా తక్కువ కాలం లోనే ఈమె కు మంచి విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అదే రేంజ్ లో కెరీర్ను అనేక సంవత్సరాల పాటు ముందుకు కొనసాగించింది. కాజల్ తన కెరియర్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. ఈమె తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసి కుర్ర కారుకు సెగలు పుట్టించాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మాత్రం మంచి విజయాలను దక్కించుకోలేక పోతుంది.

ఈమె తన కెరియర్ లో ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది. కానీ ఈమెకు లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా సరైన విజయం మాత్రం దక్కలేదు. కొంత కాలం క్రితం ఈమె సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు ముందు కాజల్మూవీ కి సంబంధించిన ప్రమోషన్లలో చాలా యాక్టివ్ గా పాల్గొంది. దానితో కాజల్ "సత్యభామ" సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా కాజల్ ఎన్నో సినిమాలతో మంచి విజయాలను అందుకున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మాత్రం ఈమెకు మంచి విజయం దక్కడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: