“అప్పుడు నేను ఇతర నటీమణుల్లా కనిపించాలి, వాళ్లలా డాన్స్ చేయాలి, వాళ్లలా యాక్ట్ చేయాలి అనే ఆలోచనతో చాలా కష్టపడ్డాను. కానీ అది నేను కాదు. నేను ఎవరిని అనుకరించాలనే భావనలో ఉండి నా స్వంత నైజాన్ని మరచిపోయాను,” అంటూ ఆమె గతాన్ని తలుచుకుంది. అయితే, ఆ తప్పులన్నీ తనకు గొప్ప పాఠాలుగా మారాయని కూడా సమంత చెప్పింది. “ఇప్పుడు ఆ సినిమాలు చూస్తే నాకు కొంత బాధ కలిగినా, అవి నాకు నేర్పిన విషయాలు చాలా గొప్పవి. ప్రతి నటుడికి, ప్రతి నటికి ఒక శిక్షణాకాలం ఉంటుంది. నా కోసం ఆ సంవత్సరాలే నా ట్రైనింగ్ పీరియడ్ అని నేను భావిస్తాను. అప్పట్లో చేసిన తప్పులు నన్ను నేడు ఉన్న స్థితికి తీసుకువచ్చాయి,” అని చెప్పింది.
సమంత మాట్లాడుతూ – “ఆ రోజుల నుంచి ఇప్పటి వరకు నేను వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ చాలా మారిపోయాను. ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడి ముందుకు సాగడం నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో గుర్తింపు పొందటం సులువు కాదు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టమని అర్థమైంది. నేను ఎన్నో ఫేస్ చూశాను, ఎన్నో కఠిన సమయాలను దాటాను. కానీ అవన్నీ నన్ను మరింత బలంగా తీర్చిదిద్దాయి,” అంటూ చెప్పింది. ఇక ఇప్పుడు తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ సమంత – “ఈ 15 ఏళ్ల ప్రయాణం నాకు చాలా నేర్పించింది. ఇంకా రాబోయే 15 సంవత్సరాల్లో నేను మరింత విభిన్నమైన పాత్రలను పోషించాలనుకుంటున్నాను. హృదయాన్ని తాకే రోల్స్ చేయాలని ఉంది. ప్రేక్షకులు నన్ను కేవలం అందం కోసం కాదు, నా నటన కోసం గుర్తుంచుకునేలా ప్రయత్నిస్తాను.” అంటూ చెప్పుకొచ్చింది. ఒకప్పుడు సమంత కి తన నటన అంటే ఇష్టం..ఇప్పుడు తన నటన వెనక్కి తిరిగి చూసుకుంటే ద్వేషం అంటూ చెప్పకనే చెప్పేసింది సమంత అంటున్నారు జనాలు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి