పవన్ అభిమానులు ‘కాటమరాయుడు’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ మన ఇరు రాష్ట్రాలలోను ధియేటర్ల వద్ద ఈరోజు సందడి చేస్తూ ఉంటే పవన్ మాత్రం ఈ ఆనందాలకు అతీతంగా నిన్న ‘కాటమరాయుడు’ గురించి ఎటువంటి టెన్షన్ లేకుండా తన కూతురు పుట్టినరోజును ఆద్యతో కలిసి నిన్న పూణేలో జరుపుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

రేణుదేశాయ్ ఈఫోటోను తన ట్విటర్ లో షేర్ చేస్తూ పవన్ అభిమానులతో ‘కాటమరాయుడు’ సక్సస్ జోష్ ను పంచుకుంది. పవన్ కు దూరంగా పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్యలు పూణేలో పెరుగుతూ ఉన్నా అవకాశం ఉన్నప్పుడల్లా పవన్ పూణే వెళ్లి తన పిల్లల యోగ క్షేమాలు తెలుసుకుంటాడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. 

అంతేకాదు పవన్ పిల్లలు మహారాష్ట్రాలోని పూణేలో చదువుతూ ఉండటం వల్ల అక్కడ తెలుగువారి చదువుకు సంబంధించిన సబ్జెక్ట్ గా ఉండని నేపధ్యంలో తన పిల్లలకు ప్రత్యేకంగా పూణేలో ఒక తెలుగు మాస్టారు ద్వారా తెలుగు నేర్పిస్తున్న విషయం కూడ తెలిసిందే. పవన్ కు తెలుగు భాష పట్ల ఉన్న మక్కువతో తన పిల్లలకు కూడ దూరంగా ఉన్నా తెలుగును నేర్పించడానికి ఎంతో శ్రమ పడుతున్నాడు పవన్.

ఒకవైపు ‘కాటమరాయుడు’ సక్సస్ సంబరాలకు దూరంగా తన కూతురుతో అతి నిరాడంబరంగా జరుపుకుంటున్న ఆద్య పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఈ ఫోటోను చూస్తే పవన్ నిరాడంబర జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్ధం అవుతుంది. ఏది ఏమైనా రాజకీయాల నుండి సినిమాల వరకు ఆ పై తన వ్యక్తిగత జీవితం వరకు ఒక విభిన్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్న పవన్ కు సంబంధించిన ఏ ఫోటోలు వచ్చినా అవి హాట్ టాపిక్ గా మారుతాయి కాబట్టి పవన్ ఆద్యల పుట్టినరోజు ఫోటో కూడ ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ సెటర్..   
  


మరింత సమాచారం తెలుసుకోండి: