బాలీవుడ్ లో రోమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ అంటే తెలియని వారు ఉండరు. మనోడు ఏ హీరోయిన్ తో అయినా ఖచ్చితంగా ఘాటైన లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే. అలాంటి ఇమ్రాన్ హష్మీ కి హైదరబాద్ లో ఘోర అవమానం జరిగింది. ఇమ్రాన్ హష్మీ హైదరాబాద్‌కు వస్తున్నాడని నగరంలోని ఆయన అభిమానులు ఒక్కచోటికి చేరుకున్నారు. షేక్‌పేట పోడియం షాపింగ్ మాల్ దగ్గర పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు గుమిగూడారు. అయితే విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులు, ప్రజలను ఎక్కడికక్కడ చెదరగొట్టారు.
మాల్ లోని ఓ షోరూంను ప్రారంభించేందుకు ఇమ్రాన్ హష్మితో పాటు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ఆహ్వానించారు. గత రాత్రి 8.30 గంటల సమయంలో కారులో మాల్ ఆవరణకు ఇమ్రాన్ రాగా, అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో చేరిన అభిమానులు ఆయన్ను దగ్గరి నుంచి చూసేందుకు పోటీ పడ్డారు. వారిని నియంత్రించడం బౌన్లర్ల వల్ల కాలేదు.
ఆపై మాల్ లోకి వచ్చేందుకు నిరాకరించిన ఇమ్రాన్ స్టోర్ ఇనాగరేషన్ లో పాల్గొనకుండానే వెనుదిరిగి పోయారు. ఆయన కారును అతికష్టం మీద మాల్ ను దాటించగలిగారు బౌన్సర్లు.దీంతో తమ అభిమాన హీరోను చూడలేకపోయామని తీవ్ర అసంతృప్తి అభిమానులు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. మరికొందరు అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా వారికి నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.