ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మద్య తెలుగు ఇండస్ట్రీలో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరనించిన విషయం తెలిసిందే. మొన్న తమిళ నటుడు అనారోగ్యంతో మరణించారు. అంతే కాదు బెంగాళీ నటి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకులు బుర్డ్ రెనాల్డ్స్ కన్నుమూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నా ఆయన గుండెపోటుతో గురువారం ఫ్లోరిడాలో రెనాల్డ్స్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన మేనెజర్ ఎరిక్ క్రిట్జెర్ ప్రకటించారు. హాలీవుడ్ లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చున్న బుర్డ్ రెనాల్డ్స్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. . కాగా 1936లో పుట్టిన రెనాల్డ్స్ ‘గన్స్మోక్’, ‘బాక్’ వంటి టెలివిజన్ సిరీస్లో పేరు తెచ్చుకున్నారు.
ఆ తరువాత ‘డెలివరెన్స్’, ‘బూగీ నైట్స్’, ‘లాంగెస్ట్ యార్డ్’ వంటి హిట్ చిత్రాలలో నటించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. వీటితో పాటు ఫ్లోరిడాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించిన రెనాల్డ్స్.. ‘మై లైఫ్’, ‘ఎనఫ్ అబౌట్ మి’ అనే రెండు ఆటో బయోగ్రఫీలను కూడా రాశారు. లెనాల్డ్స్ మృతిపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.