మూడంటే మూడే సినిమాలు చేసి స్టార్ రేంజ్ అందుకున్న విజయ్ దేవరకొండని చూసి చాలామంది హీరోలు కుళ్లుకుంటున్నారు. అసలు అతనేంటి స్టార్ ఏంటి అనుకునే వారు ఉన్నారు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రెండు విభిన్నమైన కథలతో మెప్పించిన విజయ్ నటుడిగా పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.


అయితే ఓవర్ నైట్ స్టార్ అన్న పదం బాగా వినిపిస్తున్న విజయ్ కెరియర్ లో పట్టుదల కనిపిస్తుంది. సినిమా చిన్నదా పెద్దదా అని కాదు తన దగ్గరకు వచ్చిన కథకు పూర్తి న్యాయం చేయడమే అతని పని. ఇక ప్రస్తుతం నోటా రిలీజ్ అవుతుండగా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు విజయ్.


తెలుగుతో పాటుగా తమిళంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అక్కడ ప్రమోషన్స్ లో తమిళ తంబీల మనసులు గెలుస్తున్నాడు విజయ్. తమిళుల సంస్క్రుతికి ప్రతీకగా నిలిచిన తిరుక్కురళ్ నుండి కురళ్ అనగా శ్లోకం నుండి మొదలు పెట్టిన విజయ్ అదే శ్లోకం తో తన స్పీచ్ ముగించాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటారని తమిళ ప్రేక్షకులను మెప్పించాడు.


ఆరు నెలల క్రితం తమిళం రాదని చెప్పిన విజయ్ సినిమా కోసం తమిళ నేర్చుకున్నాడు. ఇక్కడే అతని డెడికేషన్ ఏంటన్నది తెలుస్తుంది. నోటా మీకు నచ్చినా నచ్చకున్నా ఓ క్రేజీ పొలిటికల్ థిల్లర్ మీరు చూడబోతున్నారని అన్నారు. ఇక సినిమా మీద కోలీవుడ్ ప్రేక్షకులు చేస్తున్న మరన వెయిటింగ్ కామెంట్స్ నే తాను కూడా వాడి మరన వెయిటింగ్ అక్టోబర్ 5న కలుస్తా అని స్పీచ్ ముగించాడు. విజయ్ మ్యాజిక్ లో తమిళ ప్రేక్షకులు కూడా పడిపోయారని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: