ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల గుర్తుగా ఉన్న గాజు గ్లాసును... స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు కూడా కే టాయించ‌డం.. వివాదానికి దారితీస్తోంది. వాస్త‌వానికి.. ఏ నాయ‌కుడికైనా.. పార్టీకైనా.. ఎన్నికల్లో విజ‌యాన్ని అందించేది పార్టీ ఎన్నికల గుర్తే. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. గుర్తింపు పొందిన రాజ‌కీయాల‌కు.. ఈ సింబ‌ళ్ల విష‌యంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, గుర్తింపు పొంద‌ని పార్టీలు.. రిజిస్ట‌ర్డ్ పార్టీల‌కు ఎప్పుడూ.. ఈ స‌మ‌స్య ఉంటూనే ఉంటుంది.

ఇప్పుడు ఇలాంటిదే జ‌న‌సేన‌కు కూడా ఎదురైంది. ఆ పార్టీ గుర్తుగాఉన్న గాజు గ్లాసు.. ప‌ర్మినెంట్ కాదు. దీం తో దీనిని కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీసింబ‌ల్ ఖాతాలో పెట్టింది. దీనికి కార‌ణం.. జ‌న‌సేన‌కు ప‌ట్టుమ‌ని 10 శాతం కూడా ఓటు బ్యాంకు లేక‌పోవ‌డం.. న‌లుగురు ఎమ్మెల్యేలు కూడా గెల‌వ‌క‌పోవ‌డ‌మే. ఇప్ప‌టి ప‌రిస్థితి ని గ‌మ‌నిస్తే.. ఈ సారి కూడా.. ఎన్నిక‌ల గుర్తుల విషయంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. జ‌న‌సేన పోటీ చేస్తు న్న స్థానాల్లో త‌ప్ప‌.. మిగిలిన చోట్ల దాదాపు 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించారు.

వీరంతా కూడా ఇండిపెండెంట్లు.. సో.. వీరికి ఈ గుర్తును కేటాయించ‌డం ద్వారా.. కూట‌మి పార్టీల‌కు ఇబ్బందనేది.. జ‌న‌సేన వాద‌న‌. త‌మ‌కు కేటాయించిన గుర్తును వేరే పార్టీల‌కు ఎలా కేటాయిస్తార‌ని అంటున్నారు. స‌రే.. అంతా బాగానే ఉన్నా.. అస‌లు ఈ విష‌యంలో త‌ప్పు జ‌న‌సేన‌దే. ఫ్రీసింబ‌ల్‌గా ఉన్న గాజు గ్లాసును వేరేవారికి ఇవ్వ‌వ‌ద్దంటూ.. ముందుగానే కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని అభ్య‌ర్థించి ఉంటే.. ఈ ప‌రిస్తితి ఉండేది కాదు. అలా కాక‌పోయినా.. ఫ్రీసింబ‌ల్ ను ఎంచుకునే విష‌యంలోనూ తొంద‌ర‌ప‌డ‌లేదు.

ఇది.. అనేక స‌మ‌స్య‌ల‌కు దారితీసింది. వాస్త‌వానికి.. వేరే పార్టీ కూడ‌.. గాజు గ్లాసు గుర్తును కోరుకుంది. ఆ స‌మ‌యంలో కొద్దితేడాతో హైకోర్టులో జ‌నసేన బతికి బ‌య‌ట ప‌డింది. ఇక‌, ఇప్పుడు త‌న గుర్తును త‌న‌కు కేటాయించినా.. దీనిని స్వతంత్రుల‌కు కూడా.. కేటాయించ‌డం.. ఆయా స్థానాల్లో బీజేపీ, టీడీపీ నేత‌లు ఉన్న ద‌రిమిలా.. ఇది వారికి న‌ష్ట‌మ‌ని జ‌న‌సేన వాద‌న . కానీ, ముందుగానే మేల్కొని ఉంటే.. ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాదు. దీనిపై ఇప్పుడు చేస్తున్న న్యాయ పోరాటాలు.. ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: