సినీ హీరో శ్రీకాంత్ ఇటీవలే 125 సినిమాలు పూర్తి చేసుకున్నారు. సినీ హీరోలు ఏడాదికో సినిమా తీస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి రికార్డు చాలా అరుదుగానే చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. హీరో శ్రీకాంత్ భార్య ఊహ కూడా ఒకప్పుడు నటే అన్న విషయం తెలిసిందే..

Image result for srikanth and ooha family photos


సీనియర్ హీరోయిన్లందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో శ్రీకాంత్ భార్య ఊహ కూడా అలా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా.. ఇదే ప్రశ్న శ్రీకాంత్‌ను అడిగితే ఆయన అంతా ఊహ ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. తనకు ఇప్పటికే ఇలాంటి ఆఫర్లు చాలా వచ్చాయని శ్రీకాంత్ చెప్పారు.

Image result for actress ooha hd


కానీ ఊహకు ప్రస్తుతం నటనపై ఆసక్తి లేదని శ్రీకాంత్ అంటున్నారు. తనతో సరదగా ఇంటర్వ్యూలకు రమ్మన్నారానంటోందన్నారు. పెళ్లయ్యాక సినిమాల్లోకి రాకూడదన్నది ఊహ తనంతగా తాను తీసుకున్న నిర్ణయమేనంటున్నారు. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో ఇప్పుడు బాధ్యతలు పెరిగిపోయాయని చెబుతున్నారు.

Related image


శ్రీకాంత్ రెండో అబ్బాయి రోహన్ మాత్రం సినిమాల్లోకి వస్తున్నారని శ్రీకాంత్ చెప్పారు. ఇప్పటికే నటనలో లాస్ ఎంజెల్స్ లో శిక్షణ తీసుకున్నాడట. ఇప్పుడు ఇండియాకొచ్చాక డ్యాన్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. శ్రీకాంత్ కూతురు కూడా తల్లిలాగానే సినిమాలపై ఆసక్తి లేదట. బాస్కెట్ బాల్ క్రీడాకారిణి అయిన శ్రీకాంత్ కుమార్తె అండర్ 14 జట్టు తరపున జాతీయ స్థాయిలో ఆడిందట కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: