తమిళ్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గోపీచంద్ గూఢచారి పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. బాలయ్య సూపర్ హిట్ ఫిల్మ్ 'బంగారు బుల్లోడు' టైటిల్ నే ఈ సినిమా టైటిల్ గా పెట్టనున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. 1993లో బాలయ్య హీరోగా వచ్చిన 'బంగారు బుల్లోడు' మ్యూజికల్ గా క్లాసిక్ హిట్ అయింది. మరి గోపీచంద్ కి ఈ టైటిల్ ఎంతవరకు కలిసి వస్తోందో చూడాలి.
కాగా, నిన్నటి నుండి హైదరాబాద్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలనే ప్రధానంగా చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణంలో వస్తోన్న
ఈ స్పై థ్రిల్లర్ లో గోపీచంద్ సరసన బబ్లీ గర్ల్ మెహ్రీన్ కౌర్ మరియు బాలీవుడ్ హాట్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ స్ ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయట.