నందమూరి ఫ్యాన్స్ ఆశలు అవిరయ్యి... వారి గుండెలు పగిలిపోయే న్యూస్ ఒకటి ఇండస్ట్రీ కీలక వ్యక్తుల మధ్య చర్చకు వస్తోంది. నందమూరి ఫ్యామిలీకి తెలుగు సినిమా రంగానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫ్యామిలీ నుంచి ముందుగా సీనియర్ ఎన్టీఆర్ వచ్చి టాప్ హీరోగా వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగు ప్రజల గుండెల్లో రియల్ హీరో అయ్యారు.
ఎన్టీఆర్ వారసుడిగా వచ్చిన ఆయన కుమారుడు బాలకృష్ణ తండ్రి నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ మాస్ హీరోగా టాలీవుడ్లో రచ్చ రంబోలా చేసేశాడు. ఇక ఇప్పుడు బాలయ్య అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. హిందూపురం నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. బాలయ్య తరం హీరోలు చిరంజీవి, నాగార్జున వారసులు సినిమా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.
ఇక ఇప్పుడు నందమూరి అభిమానులు కూడా తమ అభిమాన హీరో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా ? అని ఎంతో ఆసక్తితో ఉన్నారు. రెండు సంవత్సరాలుగా మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతున్నా ఆ కబురు మాత్రం రావడం లేదు. టాలీవుడ్ క్లోజ్ సర్కిల్స్ ప్రకారం మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడం ఇష్టంలేదని.. అందుకే ఆ దిశగా కాన్సంట్రేషన్ చేయడం లేదని.. మోక్షు బిజినెస్ వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అందుకే బాలయ్య రెండేళ్లుగా మోక్షు వచ్చేస్తాడని ఒకటి రెండు సార్లు చెప్పినా.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారని అంటున్నారు. ఇటీవల మోక్షజ్ఞకు సంబంధించి రెండు, మూడు లుక్స్ కూడా బయటకు వచ్చాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. చాలా బొద్దుగా ఉన్న మోక్షు ఫేస్ కూడా కళ లేకుండా ఉంది. ఫిట్నెస్ మీద ఏ మాత్రం కాన్సంట్రేషన్ చేస్తున్నట్టు కనపడడం లేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ మరింత ఆందోళనతో ఉన్నారు. ఈ వార్తే నిజమైతే నందమూరి అభిమానులకు పెద్ద షాకే.