బిగ్ బాస్ 3 ఉంటుందా లేదా రెండు సీజన్లకే బిగ్ బాస్ క్యాన్సిల్ అవుతుందా.. ఈసార్ బిగ్ బాస్ హోస్ట్ గా హీరోఎవరు.. అసలు ఈ సీజన్ బిగ్ బాస్ ఉంటుందా.. ఈ వార్తలన్నిటికి సమాధానంగా బిగ్ బాస్ 3 ప్రోమో వచ్చింది. అయితే బిగ్ బాస్ సీజన్ 3 ఉంటుందన్న ప్రోమో ఆడియెన్స్ కు కిక్ ఇవ్వగా ఇప్పుడు హోస్ట్ ఎవరన్నది చెప్పే క్లూ ఇస్తూ ఓ ప్రోమో వదిలాడు.


మనసు కోతి లాంటిది.. మరి అలాంటి మనసున్న మనుషులు ఓ ఇంట్లో చేరితే.. మమకారంతో వెటకారంతో వారిని ఏకతాటిపై తెచ్చేదెవరు అధికారంతో నడిపేది ఎవరు. ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని శక్తి గల వ్యక్తి ఎవరు అంటూ ఓ ప్రసంగీకుడు చెబుతూ నాగార్జునని రివీల్ చేయకుండా వచ్చిన ప్రోమో అలరిస్తుంది.


స్టార్ మా అఫిషియల్ గా రిలీజ్ చేసిన ఈ ప్రోమోకి విశేష స్పందన వస్తుంది. బిగ్ బాస్ 3 కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా బిగ్ బాస్ సీజన్ 3 రెడీ అవుతుంది. ఈ సీజన్ ఎలా ఉంటుంది అన్న ఎక్సైట్మెంట్ వారిలో కూడా ఉంది. కంటెస్టంట్స్ పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


అయితే వారిలో ఎవరు ఉంటారు ఎవరు ఉండరన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే బిగ్ బాస్ టీం తో నాగార్జున స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి బిగ్ బాస్ సీజన్ 3 అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఇస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 ఎన్.టి.ఆర్, సీజన్ 2 నాని హోస్ట్ గా చేయగా ఈ సీజన్ కింగ్ నాగార్జున ఎలాంటి హంగామా సృష్టిస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: