స్టన్నిగ్ బ్యూటీ అంటే ఆమెను చూస్తే చాలు అలా రాయిలా అయిపోతారన్నమాట. మాట, వూసు అసలు ఉండవంతే. పూర్వం దేవలోక కన్యలు అలా చేసేవారట. అప్సరసలు ఇలకు దిగితే  మునులే చలించిపోయి తపస్సు మధ్యలో వదిలేసి మరీ అందానికి బంధీ అయిపోయేవారట. ఇపుడున్న యుగంలో అతిలోక సుందరులైనా, అప్సరసలైనా సినిమా తారలే. వారిదో లోకం. మన కోసం దిగి వస్తున్నారు. తమదైన సొగసు సోయగాలతో జనాలను ధన్యులను చేస్తున్నారు.


టాలీవుడ్ కి కొత్త అందాలు ఎపుడూ కావాలి. అది ఎలాగ మారిందంటే ప్రతీ సినిమాకు ఒకరు కాదు, ఇద్దరు ముగ్గురు కొత్త అందాలను కోరుకునే దాకా వెళ్ళింది. తెలుగులో ఆర్.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ హీరోయిన్‌గా తాజాగా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ నిర్మించాయి. ఇందులో మళయాళ భామ  అనఘ హీరోయిన్ గా పరిచయం అవుతోంది.


ఈ ముద్దుగుమ్మ  మలయాళంలో ఓ సినిమాలో సెకండ్ లీడ్‌గా చేసింది. ఆ సినిమా హిట్ అవడంతో హీరోయిన్‌గా అక్కడే మరో రెండు సినిమాలు చేసిందట.  ఆ తరువాత తమిళంలో హిప్‌హాప్ తమిజా హీరోగా సినిమా చేయడం, అది కూడా  సూపర్‌హిట్ అవ్వడంతో ఆమెను తెలుగులోకి పరిచయం చేయాలని గుణ 369 డైరెక్టర్ అర్జున్ అనుకున్నారు. ఈ మూవీలో తన   పాత్ర అచ్చంగా మన పక్కింటి అమ్మాయిగా కనిపించాలని దర్శకుడు నన్ను ఎంపిక చేశారని అనఘ అంటోంది. ఈ రోజు విడుదల అవుతున్న ఈ మూవీలో అనఘ అందాలేంటో చూడాలి మరి.


ఇదిలా ఉండగా తాను అన్ని రకాల పాత్రలు చేస్తానని అనఘ అంటోంది. అవసరం అనుకుంటే గ్లామర్ కూడా ఒలకబోస్తానని అందంగా చెబుతోంది ఈ చిన్నది.  అయితే  కధ డిమాండ్ చేయలట. మరి మన టాలీవుడ్లో కధ ఎపుడూ అలాగే డిమాండ్ చేస్తుంది కదా.   సో అనఘ గ్లామర్ ఒలకబోత ఇపుడు గుణ 369లో కొంత వరకూ చూడొచ్చు. ముందు ముందు సినిమాల్లో మరింతగా చూపిస్తాను అంటోంది. బీ రెడీ..



మరింత సమాచారం తెలుసుకోండి: