రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కూడా మామా అల్లుళ్లు అయిన వెంకటేష్, నాగ చైతన్య మొదటిసారిగా కలిసి నటిస్తున్న మూవీ ‘వెంకిమామ’. ఎఫ్ 2 తరువాత వెంకటేష్... నాగచైతన్య కలిసి చేస్తున్న సినిమా వెంకిమామ. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్ - యువ సమ్రాట్ నాగచైతన్య కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ వెంకీ మామ. జై లవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాను ముందుగా అక్టోబర్ 4న రిలీజ్ చేయాలి అనుకున్నారు.
తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా వెంకిమామ సినిమాలోని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వెంకటేష్ భుజంపై నాగచైతన్య చేయివేసి కూర్చొని ఉంటాడు. పల్లెటూరిలో షూట్ చేసిన ఈ ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఈ మద్య మరో ఫస్ట్ లుక్ తో మామా అల్లుళ్లు అదరగొట్టారు. వెంకిమామ పరువు పాయల్ వలన పోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో నడిచింది. వెంకటేష్ లాంటి సీనియర్ హీరో పక్కన నటిస్తున్న పాయల్ పద్దతిగా వెంకిమామ లో కనబడుతుంది. అందాల తో పాయల్ వలన వెంకిమామ పరువు పోతుందంటున్నారు.
ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న విషయం పై కాంట్రవర్సీ నెలకొంటుంది. అయితే మెగాస్టార్ సైరా మూవీ వచ్చినా కూడా ఈ డేట్‌కు రావాలని ఆరంభంలో అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంతో ఈ మూవీ రిలీజ్ ఆలస్యం అయ్యిందని అంటున్నారు చిత్ర యూనిట్. వాస్తవానికి సైరా లాంటి పెద్ద సినిమాతో పోటీ పెట్టుకోవడం ఇబ్బందికర విషయం అని అందుకే ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 25 అన్న డేట్ తెర పైకి వచ్చింది.
అయితే విజయ్-అట్లీ కాంబినేషన్లోని విజిల్, కార్తీ తమిళ డబ్బింగ్ సినిమా, అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమాలు వస్తాయని తెలిసింది. అందుకే వెంకీమామ మళ్లీ మరో డేట్ చూసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీపావళికి రిలీజ్ చేస్తారా..మరోసారి పోస్ట్ పోన్ చేస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూద్దాం.