యోగా బ్యూటీ అనుష్క ఇళ్ళను దానం చేసే కార్యక్రమం చేపట్టింది. అయితే అనుష్కలో ఈ అనూహ్యమైన మార్పుకు కారణం కోలీవుడ్ హీరో అజిత్ అనే మాటలు వినిపిస్తున్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఎన్నైఅరిందాల్’ సినిమాలో నటిస్తున్న అజిత్ చేసిన జ్ఞానభోధ వల్ల అనుష్కలో ఈమార్పు వచ్చింది అని అంటున్నారు. అజిత్ ఈ మధ్య తన దగ్గర ఎంతోకాలంగా పనిచేస్తున్న సహాయకులకు 12 ఇళ్ళు కట్టించి ఇచ్చి కోలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ గా మారాడు.

తన దగ్గర పనిచేసే డ్రైవర్ దగ్గరనుండి గార్డెనర్ వరకు ఇళ్ళు కట్టించిన అజిత్ ఉదారత అనుష్కను ప్రభావితం చేసింది అని టాక్. దీనితో అనుష్క కూడా తన దగ్గర పనిచేసే వ్యక్తిగత సహాయుకులకు కొంత మందికి ఇళ్ళు కట్టించి ఇవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీనికోసం ఇప్పటికే ఈ యోగ బ్యూటీ భాగ్యనగరంలో ఒక స్థలాన్ని కొనుగోలు చేసిందని టాక్. కోట్లాది రూపాయలను పారితోషికాలుగా తీసుకుంటున్న అనుష్క లాంటి హీరోయిన్స్ చాలామంది ఇక అనుష్కను అనుసరిస్తూ తమ వ్యక్తిగత సహాయకుల కోసం ఇళ్ళను దానం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి.

ఈ వార్తలు ఇలా ఉండగా రెండు భారీ సినిమాలలో నటిస్తూ రాణిరుద్రమగా రాజకుమారిగా నటిస్తున్న అనుష్క కెరియర్ కు సంబంధించి ఈ సంవత్సరం ఆమె సినిమాలు కీలకంగా మారనున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: