తమిళ హీరో అయినా సూర్యా తెలుగు వాళ్లకు మంచి సుపరిచితుడే.. 'గజిని', 'యముడు' సింగం 2 చిత్రాలతో తెలుగులో సూపర్బ్ క్రేజి హీరోగా ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు సూర్య. వెంకట్ ప్రభు దర్శకత్వంలో సన్సేషనల్ హిట్స్ అందించిన స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్ధ పై కె.ఇ.జ్ఞానవేల్ సమర్పిస్తున్న చిత్రం ‘రాక్షసుడు’. ఈ సినిమా తమిళంలో మాస్ పేరుతో విడుదల అవుతుంది. మెలోడి మాస్టర్ యువన్‌శంకర్ రాజా అందించిన పాటలు ఇటీవలే విడుదలై సూపర్ హిట్టయ్యాయి.
ఆడియో ఫంక్షన్ లో సూర్య, ప్రభాస్,కోదండరామిరెడ్డి
ఈ చిత్రాన్ని తెలుగు లో మేధా క్రియోషన్స్ అధినేతలు మిరియాల రాజాబాబు(కృష్ణారెడ్డి), మిరియాల రవిందర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈనెల 29న రాక్షసుడు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్యా చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడట, ఇక అందాల భామలు నయనతార, ప్రణిత ఫుల్ గ్లామర్ రోల్ పోషించారట.