భారత్ చైనా మధ్య ఉన్న గొడవను తాను క్యాష్  చేసుకోవాలని అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నారైల ఓటు బ్యాంకు కోసం గానూ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా  ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ లో ఇప్పుడు చైనా మీద చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. అసలు చైనా పేరు వింటే చాలు జనాలకు ఎక్కడో ఒళ్ళు మండుతుంది. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా అమెరికా క్యాష్ చేసుకునే విధంగా పావులు కదుపుతుంది. భారత పాలకులు చైనాకు వ్యతిరేకంగా బలమైన అడుగులు వేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఏంటీ అంటే... అమెరికా కొన్ని వస్తువులను దిగుమతి చేసుకునే విషయంలో నిషేధం విధించే విధంగా ప్లాన్ చేస్తుంది అని అంటున్నారు.  చైనా నుంచి వచ్చే కొన్ని వస్తువులను ట్రంప్ బాన్ చేయడం ద్వారా భారత ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. దీని వలన చైనా మీద వ్యతిరేకత ఉన్న దేశాల ఓట్లు కూడా తనకు పడతాయి అనే భావనలో ట్రంప్ ఉన్నారు అని తెలుస్తుంది. మన దేశంలో చైనాను తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా చైనా వస్తువులను వాడటం కూడా నిషేధించే పరిస్థితి ఉంది అనే చెప్పాలి.

స్వచ్చందంగా ప్రజలు వస్తువులను బాన్ చేస్తున్నారు. కాబట్టి ట్రంప్ ఇది మంచి ఫలితం ఇస్తుంది అని భావిస్తున్నారు. దేశంలో కరోనా విషయంలో ట్రంప్  పదే పదే చైనాను నిందిస్తూ విమర్శలు చేస్తున్నారు. చైనా వైరస్ ని కనిపెట్టి అమెరికా మీద వదిలింది అనే భావనలో ట్రంప్ ఉన్నారు. దీని ద్వారా కూడా ఇండియాన్స్ ని తన వైపు తిప్పుకునే విధంగా పావులు కదుపుతున్నారు. మరి  ఎన్నారైలు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దుల్లో వివాదం కూడా తీవ్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

v