ఒక టాప్ అమెరికా యూనివర్సిటీ భారత మూలాలున్న బాలికను ప్రపంచంలోనే అత్యంత తెలివైన స్టూడెంట్‌గా ప్రకటించింది. పదకొండేళ్ల ఇండో-అమెరికన్ నటాషా పెరీ న్యూజెర్సీలోని థెల్మా L. శాండ్‌మీర్ ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుకుంటోంది. అయితే 2021 సంవత్సరంలో ఆమె ఒక టాలెంట్ టెస్ట్ లో పాల్గొంది. జాన్స్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ టాలెంట్ సెర్చ్‌లో పాటిస్పేట్ చేసిన నటాషా పెరీ తన అద్భుతమైన ప్రతిభను చాటింది. ఈ ప్రతిభ పోటీలలో SAT, ACT వంటి అసెస్‌మెంట్‌ టెస్టులు నిర్వహించారు. ఇందులో 84 దేశాలనుంచి 19 వేల మంది విద్యార్థులు పాటిస్పేట్ చేశారు. అబౌట్-గ్రేడ్-టెస్టింగ్ (ప్రస్తుత తరగతి కంటే ఎక్కువ) చేసి అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేయడమే ఈ టాలెంట్ సెర్చ్‌ ముఖ్య ఉద్దేశం.

అయితే 2021 మార్చి నెల సమయంలో నటాషా పెరీ టాలెంట్ సెర్చ్‌లో పాల్గొంది. అప్పటికి ఈ బాలిక ఐదవ గ్రేడ్ చదువుతోంది. అయితే ఈమె అడ్వాన్స్డ్ గ్రేడ్ 8 పర్ఫామెన్స్ కి 90వ శాతం సమానంగా వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాలలో ఫలితాలు రాబట్టింది. ఒక 8వ గ్రేడ్ తెలివైన విద్యార్థికి సమానంగా ఆమె పర్ఫామెన్స్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం. జాన్ హాప్‌కిన్స్ విద్యావేత్తలు సైతం నటాషా పెరీ ప్రతిభకు మంత్రముగ్దులయ్యారు. తర్వాత ఆమెకు "హై హానర్స్ అవార్డ్స్ " అవార్డు ప్రకటించారు. దీంతో నటాషా ఆనందం వ్యక్తం చేసింది. ఈ అవార్డు నన్ను మరింతగా ప్రేరేపిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. డూడ్లింగ్, జెఆర్ఆర్ టోల్కీన్ నవలలు చదవడం వల్ల తనకు మంచి వెర్బల్, క్వాంటిటేటివ్ స్కిల్స్ వచ్చి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడింది.

జాన్స్ హాప్‌కిన్స్ టాలెంట్ సెర్చ్ టెస్ట్ లో కేవలం 20 శాతం మంది మాత్రమే హై హానర్ అవార్డుకి క్వాలిఫై అయ్యారు. మిగతా 80 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై కూడా కాలేదు. అత్యంత కష్టతరమైన ఈ టెస్టులో క్వాలిఫై కావటమే కాకుండా టాపర్ గా నిలవడం చాలా గొప్ప విషయం. ఇకపోతే క్వాలిఫై అయిన వారందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి తమ ప్రతిభను మరింత మెరుగు పరుచుకోవడానికి కూడా వీలుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: