ప్రస్తుతము ఉక్రెయిన్ లో ఎంత అల్లకల్లోల పరిస్థితుల నెలకొన్నాయో ప్రత్యేకం  గా చెప్పాల్సిన పని లేదు. రష్యన్ సేనలు ఎక్కడ వెనకడుగు వేయకుండా ఉక్రెయిన్ పై విరుచుకు పడుతూన్నాయి. మొదటి రెండు మూడు రోజుల యుద్ధం లో కేవలం సైనిక స్థావరాల పై మాత్రమే దాడులు చేసిన రష్యన్ సేనలు.. ఇక ఇప్పుడు జనావాసాల పై కూడా దాడులు చేస్తూ ఉండడం  తో ఉక్రెయిన్ లో మారణ హోమం జరుగుతుంది. ఇప్పటికే  వందల మంది సాధారణ పౌరులు కూడా మరణించారు అనే విషయం తెలుస్తుంది.


 ఇలాంటి సమయం లో అటు రష్యా తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే యుద్ధం ఆపాలంటూ కఠిన ఆంక్షలు కూడా విధిస్తున్నాయి. అయితే ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు  విధించి నప్పటికీ తగ్గేదేలే అన్నట్లు గా రష్యా అధ్యక్షుడు పుతిన్ దూసుకు పోతున్నారు. ఉక్రెయిన్ విషయం లో కాస్తయినా మానవత్వం చూపించడం లేదు. ఇలాంటి సమయం లో అటు ప్రాణభయం తో పరుగులు పెడుతున్న ఉక్రెయిన్ ప్రజలు ఇక అక్కడి చారిత్రాత్మక విగ్రహాలను కాపాడు కోవడానికి చేస్తున్నారు అని తెలుస్తోంది.


 పూర్వీకుల కాలం నుంచి   వస్తున్న చారిత్రాత్మకమైన విగ్రహాల ను కాపాడు కోవడానికి అక్కడ ఉన్న విగ్రహాలను పేపర్ లో చుట్టడం లేదా ఇతర సామాగ్రి తో భద్ర పరచడం  చేస్తున్నారు అని అర్థమవుతుంది. అంతే కాకుండా ఇక తీయడానికి వీలు లేని విగ్రహాల చుట్టూ కూడా పేపర్ చుడుతూ ఇక బాంబుల దాడి లో ఎలాంటి ధ్వంసం కాకుండా ఉండడానికి ఉక్రెయిన్ ప్రజలు ఇక్కడ చారిత్రాత్మక విగ్రహాలను దాచేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ఒక వైపు తమ ప్రాణాలను రక్షించు కోవడానికి మరోవైపు సాంస్కృతిక వారసత్వ విగ్రహాలను కూడా రక్షించుకునేందుకు ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు అన్నది అర్ధమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: