ఈ భూమి మీద కోట్లాది జీవరాసులు ఉన్నాయి. అయితే ఇందులో మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. అయితే సాదరణంగా భూమి మీద బ్రతికే జీవులన్నీ కూడా మనుషుల్లాగానే ఆక్సిజన్ పీల్చుకొని మనుగడను కొనసాగిస్తాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక మనుషులతో పాటుగానే అన్ని రకాల జంతువులు, క్షీరదాలు కూడా ఇలా ఆక్సిజన్ పీల్చుకోవడం తోనే బ్రతుకుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ ఇక అప్పుడప్పుడు వింతైన జీవులకు సంబంధించిన విషయాలు తెరమీదకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.


 ఏకంగా ఆక్సిజన్ పీల్చకుండా బ్రతికే జీవులు కూడా ఈ భూమి మీద ఉన్నాయి అని అప్పుడప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలో బయటపడుతూ  ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటిది ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంటుంది. అయితే  ఇలాంటి ఒక వింతైన జీవి గురించి తెలిసి ఇంటర్నెట్ జనాలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలాంటి జీవులు కూడా భూమ్మీద ఉన్నాయా అని షాక్ లో మునిగిపోతారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి జీవి గురించిన వార్త తెరమీదకి వచ్చింది. ఆ జీవికి ఎనిమిది కాళ్లు.. ఆక్సిజన్ లేకుండానే ఆ జీవి బ్రతికేస్తుంది.


 అంతేకాదు ఐదు యుగాంతాలను కూడా ఎంతో సునాయాసంగా తప్పించుకున్నాయి. ఆ జీవి పేరు టర్ది గ్రేడ్స్. మిల్లీమీటర్ కంటే తక్కువ పొడవు ఉండే దీనికి ఆక్సిజన్ నీరు అస్సలు అక్కర్లేదు. ఏకంగా ఇది ఐదు యుగాంతాలను సునాయాసంగా దాటుకొని వచ్చింది అని శాస్త్రవేత్తలు గుర్తించారు. కణజాలలోని సెన్సార్ వల్లే భయంకరమైన పరిస్థితులను తట్టుకుని ఈ జీవులు బ్రతికేస్తున్నాయని యూఎస్ లోని మార్షల్ యూనివర్సిటీ ఇటీవల తెలిపింది. అయితే ఈ జీవులకు ఏదైనా అపాయం వస్తే వెంటనే నిద్రావస్థలోకి వెళ్లిపోతాయట. ప్రపంచంలోనే ప్రతి చోటా కూడా ఇవి ఉంటాయని.. అయితే చిన్న ఆకారం కలిగి ఉండడంతో కంటికి కనిపించవు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: