ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఏదైనా ఉందంటే అది రఘురామకృష్ణం రాజు రాజీనామా ఇష్యూ. ఇంతకాలం వైసీపీ రెబల్ ఎంపీగా ఉంటూ..వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చిన రఘురామ...ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకాలం ఢిల్లీలో ఉంటూ రాజకీయం చేసిన రఘురామ...ఇకపై ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఇక ఈయన ఎంపీ పదవికి రాజీనామా చేసి..బీజేపీలో చేరనున్నారు.

అలాగే నరసాపురం ఉపఎన్నికలో బీజేపీ తరుపున బరిలో నిలబడతారు. అయితే రాజకీయంగా బీజేపీకి పెద్ద బలం లేదు. అలా అని జనసేన సపోర్ట్ ఉన్నా సరే రఘురామ గెలవలేదు. కానీ ఆయన టీడీపీ సపోర్ట్ కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. అప్పుడు రఘురామ గెలుపు సులువు అని భావిస్తున్నారు. అంటే టీడీపీ-జనసేనల మద్ధతుతో రఘురామ బరిలో దిగుతారు.

కానీ ఇక్కడే కొత్త ట్విస్ట్ వస్తుంది. ఇప్పుడు పొత్తులపై పెద్ద రచ్చ జరుగుతున్న  విషయం తెలిసిందే. టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో జనసేన ముందుకు రావడం లేదని చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. అటు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లాంటి వారైతే, చంద్రబాబుపై డైరక్ట్‌గా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజు గారు బీజేపీ నుంచి పోటీ చేస్తే టీడీపీ మద్ధతు ఇవ్వకూడదని, టీడీపీ కూడా పోటీ చేయాలని పలువురు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

అసలు బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని, పైగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న బీజేపీకి మద్ధతు ఇచ్చి, ఆ పార్టీని పెద్దగా చేస్తే టీడీపీకే నష్టమని, ఓడిపోయిన పర్లేదు గానీ టీడీపీ ఒంటరిగానే బరిలో దిగాలని చెప్పి కార్యకర్తలు కోరుతున్నారు. నరసాపురంలో టీడీపీ కంటూ బలమైన ఓటు బ్యాంక్ ఉందని, అలాంటప్పుడు ఆ ఓటు బ్యాంకుని బీజేపీకి మళ్ళించడం వల్ల టీడీపీకే నష్టం జరుగుతుందని అంటున్నారు. కాబట్టి రాజుగారుపై టీడీపీ అభ్యర్ధిని పోటీలో దించాలని కోరుతున్నారు. చూడాలి మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: