చైనా ప్రభావం తో కమ్మేసిన నేపాల్ మైకం మబ్బులు క్రమ క్రమంగా విడిపోతున్నట్లుంది. చైనాతో కొంతకాలం స్నేహం చేస్తే చాలు అది నిన్ను నీ మనసు నే కాదు నీ అస్తిత్వాన్ని కూడా కబ్జా చేయగలదు. అందరూ మోసం చేసే వాళ్ళే. అయితే చైనా మోసం జరిగింది అనేది తెలియకుండానే చేస్తుంది. ఈ పద్దతి స్నేహం లో "సలాం స్లైసింగ్" పని అద్భుతంగా చేసేస్తుంది.
gandagi river power project of nepal కోసం చిత్ర ఫలితం

ఇప్పుడిప్పుడే నేపాల్ ప్రభుత్వం భద్రతకు సంబంధించిన విధి విధాన వైపరీత్యాలను అర్ధం చేసుకోగలుగు తుంది అనడానికి ఇది నిదర్శనం. తమ దేశంలోని "గండకీనది" పై  "విద్యుత్ ఉత్పాదక జలాశయం" నిర్మించడానికి చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నేపాల్ ప్రభుత్వం ఈ మద్యనే రద్దు చేసింది. ఇలా ఈ ఒప్పందం రద్దుకావడం నేపాల్‌ తో చైనా కొనసాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణ కు ఎదురుదెబ్బ తగిలింది.

china attrocities on nepal about ganDaki project కోసం చిత్ర ఫలితం

నేపాల్‌ లో చైనా ఉనికి పెరగడం మనదేశ భద్రత కు సైతం ప్రమాదకరం. నేపాల్ భద్రత మనదేశ భద్రతతో ముడిపడి ఉంది. కానీ రెండు దశాబ్ధాలుగా చైనా ప్రభుత్వం నేపాల్‌ లోకి వ్యూహాత్మకం గా చొరబడుతూనే ఉంది! క్రీస్తుశకం 1996లో "నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ లోని చైనా అనుకూల వర్గం" ఆ పార్టీ నుండి చీలిపోయి మావోయిస్టు పార్టీగా అవతరించిననాటి నుంచి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం వ్యూహాత్మక దురాక్రమణ కొనసాగుతోంది. మావోయిస్టులు "నేపాల్ మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ" గా ఏర్పడి పదేళ్ళ పాటు నేపాల్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను దాదాపుగా నిరోధించారు. ఆ పదేళ్ళు ప్రజాస్వామ్య ఆనవాళ్ళే లేకుండా పోయాయి.

modi jinping కోసం చిత్ర ఫలితం

నేపాల్‌ లో "ప్రజాస్వామ్యం" రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడరాదన్నది చైనా కమ్యూనిస్టు పార్టీ వారి కోరిక. చైనా లో లాగే నేపాల్‌లో కూడ ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థ ఏర్పడాల న్నది చైనా కమ్యూనిస్టుల దుర్వాంఛ అలాగే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ లోని చైనా అనుకూల వర్గం అభిమతం. ఎందుకంటే బహుళపక్ష ప్రజాస్వామ్య నేపాల్ భారతదేశంతో యుగయుగాల మైత్రిని కొనసాగించ గలదు. 



భారత్ తో సమాన సాంస్కృతిక జాతీయత నేపాల్‌ లో కొనసాగుతూ ఉండటంతో, మన దేశాన్ని తన సహజ స్నేహం తోనే పెనవేస్తోంది. క్రీస్తుశకం 1950లో మన దేశానికి, నేపాల్‌కు మధ్య కుదిరిన "శాంతి-స్నేహ అంగీకారం" యుగ యుగాలనాటి ఈ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి మరో ధ్రువీకరణ. ఈ మైత్రిని చెడగొట్టడం, తాము నేపాల్‌ కు దగ్గరకావడం చైనా ఆధిపత్య విస్తరణ వ్యూహంలోని మొదటి దశ! అందువల్ల చైనా ప్రేరణలో పుట్టుకొచ్చిన నేపాల్ మావోయిస్టు పార్టీ 1996నుంచి నేపాల్‌ లో భయంకర బీభత్సకాండ జరిపింది.
సంబంధిత చిత్రం

ఈ బీభత్సకాండకు పదమూడు వేలమందికి పైగా బలైపోవడం ఒక చరిత్ర! "తుపాకిగొట్టం ద్వారా రాజ్యాధికారం లభిస్తుందనే" ఆశ అడుగంటి పోవడంతో 2005లో మావోయిస్టు పార్టీ అధినేత 'పుష్పకమల్ దహల్ ప్రచండ' వ్యూహం మార్చాడు. ఇలా వ్యూహం మార్చడం చైనా విస్తృత వ్యూహంలో భాగం. ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల నిబద్ధతను అభినయించడం ఈ మారిన వ్యూహం. ప్రజాస్వామ్య ప్రక్రియను ఉపయోగించి నేపాల్‌ను భారత్ నుంచి మిత్రభేదం చేసి,  చైనా ద్రుతరాష్ట్ర  కౌగిలి లొ ఇరికించి కూర్చుండబెట్టాలన్నది ‘ప్రచండ’ వ్యూహం! 
సంబంధిత చిత్రం

ఇందులో భాగంగానే గత ఏడాది ప్రచండ ప్రధాన మంత్రిత్వం లోని నేపాల్ ప్రభుత్వం గండకీ నదిపై "జలవిద్యుత్ కేంద్ర నిర్మాణం" కార్యక్రమాన్ని చైనాకు చెందిన ‘గెఝో ఉబా’ అన్న బహుళ జాతి వాణిజ్య సంస్థకు కట్టబెట్టింది! "షేర్ బహదూర్ దూబా"  ప్రధాన మంత్రి నాయకత్వం లోని నేపాల్ ప్రభుత్వం ఈ "జలవిద్యుత్ కేంద్రం" ఒప్పందాన్ని రద్దు చేయడం మన దేశానికి పరోక్ష విజయం.


నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి, మన ప్రభుత్వం చైనా వారి రాజకీయ, భౌతిక, మానసిక, వ్యూహాత్మక, వాణిజ్య, దౌత్య, భౌగోళిక దురాక్రమణను అడ్డు కునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. చైనా ప్రభుత్వం మరింత తీవ్రంగా తన ప్రచ్ఛన్న దురాక్రమణను కొనసాగిస్తుండడం అందరికీ తెలిసిన సత్యం. మన ప్రభుత్వం అడుగడుగున చైనాని అడ్డుకుంటోంది. 
pak gwadar port కోసం చిత్ర ఫలితం

పాకిస్తాన్‌ లోని "గ్వాడార్ ఓడరేవు" అభివృద్ధి పేరుతో చైనా నౌకాదళం మన పడమటి తీరంలో నిరంతరం పచార్లు చేస్తోంది. ఇందుకు సమాధానంగా మన ప్రభుత్వం ఇరాన్‌ లోని "చౌబహార్" ఓడరేవు అభివృద్ధిని చేపట్టింది. చైనా ఇంతటితో ఆగలేదు. అరేబియా సముద్రానికి, హిందూ మహాసముద్రానికి సమీపంలో ఉన్న ఆఫ్రికా దేశమైన "జిబౌటి" లో తన నౌకాదళ స్థావరాన్ని స్థాపించింది. శ్రీలంక లోను మాల్‌దీవుల లోను చైనా సైనిక కలాపాలు పెరుగుతుండడం క్రీస్తుశకం 2009 నుంచి నడుస్తున్న చరిత్ర.

sri lanka hambantota port కోసం చిత్ర ఫలితం

శ్రీలంక ఆగ్నేయ సముద్ర తీరంలో ఉన్న "హంబన్‌తోట" ఓడరేవు నిర్వహణలో చైనాకు భాగస్వామ్యం ఏర్పడడం ఇటీవల సంభవించిన భారత వ్యతిరేక పరిణామం. దీనిద్వారా దీని పేరుతో శ్రీలంక తీర జలాలలో చైనా నౌకలు జలాంతర్గాములు తిష్టవేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం, చైనా తో కుదుర్చుకున్న "విద్యుత్ కేంద్ర నిర్మాణం" ఒప్పందం రద్దు కావడం భారత్‌కు పరోక్ష దౌత్య విజయం.

sri lanka hambantota port కోసం చిత్ర ఫలితం

మాల్‌ దీవులలో చైనా తొలిసారిగా 2011 నవంబర్‌లో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగింది. అంతవరకూ శ్రీలంక లోని తమ రాయబారి కార్యాలయం ద్వారా మాత్రమే చైనా మాల్‌  దీవులలో వ్యవహరించగలిగింది. దక్షిణ వైపునుంచి మనదేశంపై దురాక్రమణ జరుపడం ఈ దౌత్య విస్తరణకు లక్ష్యం. ఇలా చైనా తమ దేశంతో దౌత్య కార్యాలయాన్ని నెలకొల్పడానికి అనుమతించడం ద్వారా మాల్‌ దీవుల ప్రభుత్వం భారత్ వ్యతిరేకతకు ఒడిగట్టింది. 2011 వరకు మాల్‌ దీవులతో మన దేశానికి మరో మూడు దేశాలకు మాత్రమే దౌత్య కార్యాలయాలు ఉండేవి! చైనా ఐదవ దేశమైంది. 
male gmr airport project కోసం చిత్ర ఫలితం

ఇలా చైనా చొరబడిన తరువాత సంవత్సరం తిరగకముందే మనదేశానికి చెందిన "జిఎమ్‌ఆర్" వాణిజ్య సంస్థతో కుదుర్చు కున్న విమానాశ్రయ నిర్మాణ ఒప్పందాన్ని మాల్‌ దీవుల ప్రభుత్వం రద్దు చేసింది! రాజధాని మాలే సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు మన సంస్థ నిర్మాణం సాగించిన తరువాత వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తరువాత మాల్‌ దీవుల ప్రభుత్వం మాట తప్పింది! ఒప్పందాన్ని రద్దు చేసింది! 
male gmr airport project కోసం చిత్ర ఫలితం

ప్రపంచీకరణ నియమాలకు మనదేశం కట్టుబడ్దట్టుగా మరే దేశం కూడా కట్టుబడట్లేదు. అతి చిన్నదేశమైన మాల్‌ దీవులు ఇలా "ప్రపంచీకరణ వాణిజ్య విధి విధానాలు"  లను భాద్యతా రహితంగా నిర్భయంగా ఉల్లంఘించింది! ఇందుకు కారణం చైనా ప్రభుత్వం మాల్‌ దీవులను మనకు వ్యతిరేకంగా ఉసి గొల్పడం. అలా రద్దయిన ఒప్పందాన్ని మాల్‌ దీవుల ప్రభుత్వం ఆ తరువాత ఒక చైనా వాణిజ్య సంస్థకు కట్టబెట్టింది! 
male gmr airport project కోసం చిత్ర ఫలితం
మనకు వ్యతిరేకంగా ఇరుగు పొరుగు దేశాలతో  దౌత్య దౌర్జన్యం చేస్తున్న చైనా దురహంకారానికి నేపాల్‌ లో ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది!  గండకీ నదిపై జల విద్యుత్ కేంద్ర నిర్మాణ ప్రోజెక్ట్ ను ఇప్పుడు నేపాల్ ప్రభుత్వం మన దేశానికి చెందిన వాణిజ్య సంస్థలకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది.


మావోయిస్టు నాయకుడు ప్రచండ 2008 నుంచి రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యాడు. ప్రతిసారీ సంవత్సరం తిరగకముందే రాజీనామా చేయవలసి వచ్చింది! రెండు సార్లు, ప్రధానిగా ఉండిన సమయంలో ప్రచండ పూర్తి  భారత వ్యతిరేక విధానాలను అవలంబించాడు. ఈ వ్యతిరేకత లో భాగంగానే గత జూన్ ఆరవ తేదీన ఈ "గండకీ నదీ జల విధ్యుత్ కేంద్ర నిర్మాణ ఒప్పందం" చైనా తో కుదుర్చుకున్నాడు. దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చుకాగల ఈ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంవల్ల పన్నెండు వేల మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది. హిమాలయ రాజ్యమైన నేపాల్ చైనా ధృతరాష్ట్ర విష కౌగిలి నుండి బయటపడటం ఒకరకంగా భారత్ దౌత్య విజయమే కావచ్చు. 

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: