పులి తన పిల్లల్ని తానే చంపేస్తుంది. పాము కూడా అంతే. అయితే అవి ఙ్జానం లేని జంతువులు. కాని ఙ్జానం పరిణితి చెందిన ఆలోచనలను వెలువరించే మానవ జాతికి జంతు గుణాలు సంతరించుకుంటున్న విడ్డూరం మనం చదవబోతున్నాం. మనకు ఆశ్చ‌ర్య‌క‌రమైనా విశ్మయకరమైనా ఇది నూరుపాళ్ళు నిజమైన వార్తే. ముస్లిం మ‌త‌ విశ్వాసాన్ని గౌర‌వించే ఈజిప్టులో వారి పవిత్ర మసీదుపై ముస్లిములే దాడి చేయటం జ‌రిగింది.
Image: People sit next to bodies of worshippers

ముస్లింల దేశంలో ఒక పవిత్ర మసీదుపై దాడి జరగడం అందరినీ దిగ్భ్రమకు గురిచేసింది. అల్-అరిష్ లోని ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో ప్రార్ధనలో ఉన్న వారిని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. నాలుగు వాహనాల్లో వచ్చిన కొందరు ఉగ్రవాదులు మసీదు పై బాంబులతో దాడి చేశారు.భయంతో బయటకు పరుగు పెడుతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 184 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 120 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Image result for terror attack in egypt on a masjid

ఈ భ‌యానక దాడి కార‌ణంగా, ఆనేల రక్తంతో తడిసిపోయింది. ఎక్కడ చూసినా మృతదేహాలు, మాంసపుముద్దలు, చెల్లా చెదరు గా పడిపోయాయి. మసీదులో ఎటు చూసినా ఆహాకారాలే రక్తపుటేరులే. ఘటనాస్థలికి చేరుకున్న అక్కడి భద్రతా సిబ్బంది, క్షత గాత్రులను సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆ దేశ  ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ, ఇప్పటి వరకు 184 మంది చనిపోయినట్లు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.
Image result for president of egypt
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా, రాజధాని కైరోలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, సినాయ్‌ లో జరిగిన ఉగ్రదాడిపై సమీక్షించారు. ఉగ్రదాడి నేపథ్యంలో మూడు రోజులు సంతాపదినాలుగా ఈజిప్టు ప్రభుత్వం ప్రకటించింది.  కాగా, ఈజిప్ట్‌లో ఉగ్ర‌వాదులతీరు భిన్నంగా ఉంటుంద‌ని అంటున్నారు. ఇక్కడ "ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు" ఎక్కువగా "కాప్టిక్ క్రిస్టియన్ చర్చి" లనే టార్గెట్ చేస్తారు. క్రిస్టియన్లతో పాటు భద్రతా దళాలను హతమార్చడమే ఇక్కడి ఇస్లామిక్ స్టేట్ పని. కానీ దానికి భిన్నంగా "బిల్ అర్ అబ్ద్ మసీదు" లో దాడి జరిగింది.

Image result for terror attack in egypt on a masjid

ఈ సంఘటన యావత్ ముస్లిందేశాలను విస్మయపరిచింది. ఈజిప్టు ప్రజలు కూడా తీవ్రమైన షాక్‌ కు గురయ్యారు. ఉగ్రవాదు లు ప్రత్యేకంగా "సూఫీ ముస్లిం" లను టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. భారీవాహనంలో మసీదుకువచ్చిన దుండగలు, మసీదులో బాంబులు పేల్చారు. అక్కడ నుంచి పారిపోతున్న వారిని గన్నులతో కాల్చేశారు. మసీదు దాడిలో ఒక సూసైడ్ బాంబర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


కాగా, ఈ దాడి వెనుక అనేక క్లిష్స్టతర మ‌త‌ప‌ర‌మైన అంశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సూఫీ ముస్లింలు ఇస్లాం మతంలో ప్రత్యేక మైనవాళ్లు. సాంప్రదాయ ముస్లింలు, సున్నీ తీవ్ర వాదులు, సూఫీ ముస్లిం లను మత విరోధులగా భావిస్తారు.  బిర్ అల్ అబ్ద్ ప్రాంతంలో ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అనేక మంది సూఫీ మతస్తులను చంపే శారు. కానీ గతంలో వాళ్లు ఎప్పుడూ ఒక మసీదును మాత్రం టార్గెట్ చేయలేదు. అయితే ఈ సారి మసీదులోనే సూఫీ ముస్లిం లను హతమార్చడం ఇస్లామిక్ స్టేట్  వికృత పైశాచికత్వాన్ని వెలుగులోకి తెచ్చింది.  

Image result for terror attack in egypt on a masjid

మరింత సమాచారం తెలుసుకోండి: