చంద్రబాబునాయుడు తాను ఏదనుకుంటే అదే చేస్తారు. దాన్నే  కరెక్ట్ అని నమ్మించగలుగుతారు కూడా. ఇపుడు చంద్రబాబుకు చాలా సమయం ఉంది. దాంతో ఆయన రెగ్యులర్ సీఎం మాదిరిగా హడావుడి చేయాలనుకుంటున్నారు. పోలింగుకు, కౌంటింగుకు మధ్య బోలేడు గ్యాప్ ఉండడంతో బాబుకు అది ఇబ్బందిగా మారుతోంది అందువల్ల బాబు అర్జంట్ గా రివ్యూస్ చేయాలనుకుంటున్నారు. మరి ఈసీ ఒప్పుకుంటుందా


పోలింగ్ అయిన రెండు రోజులకే పోలవరం ప్రగతిపై సచివాలయంలో బాబు రివ్యూ మీటింగ్ పెడితే ఈసీ అబ్జెక్ట్ చేసిన సంగతి విధితమే. ఈ మీటింగునకు నీటి పారుదల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, నీటి వనరుల విభాగం ప్రిన్సిపల్ సెక్రటరి శశిభూషన్ కుమార్ హాజరయ్యారు. ఆ మీటింగ్ తరువాత ఈసీ ఎన్నికల కోడ్ ని గుర్తు చేసి మరీ  రివ్యూలు వద్దనేసింది. సరే అది అయిపోయింది. దాని మీద తమ్ముళ్లు కూడా గుర్రుమన్నారు. 


పోలవరం లాంటి ప్రతిష్టాత్మమైన ప్రాజెక్ట్ విషయంలో ప్రజా ముఖ్యమంత్రినే రివ్యూస్ చేయవద్దు  అంటారా అంటూ గట్టిగా తమ్ముళ్లు గొడవ పెట్టారు. ఇపుడు అదలా ఉండగానే చంద్రబాబు మరో మారు పోలవరం మీద ఈసీతో పేచీకి దిగేలా సీన్ కనిపిస్తోంది. ప్రతి సోమవారాన్ని పోలవరం వారంగా చెప్పుకున్న టీడీపీ ప్రభుత్వం గత కొన్ని సోమవారాలు ఖాళీగా వదిలేసింది  ఎన్నికల కోడ్ వల్ల. అయితే ఇపుడు మాత్రం బాబు అందుకు సిధ్ధంగా లేరనిపిస్తోంది.



పోలవరం ప్రాజెక్ట్ ను బాబు స్వయంగా చూడాలనుకుంటున్నారని ఓ న్యూస్ ఇపుడు బయటకు వచ్చింది ఇందులో ఎంతవరకూ నిజముందో కానీ ఈ సోమవారం అంటే 6వ తేదీన బాబు పోలవరం విజిట్ కి వెళ్తారని అంటున్నారు. అక్కడ ప్రాజెక్ట్ పనులు చూడడమే కాదు. అధికారులతో రివ్యూ కూడా పెడతారని అంటున్నారు. మరి బాబు ఇలా చేస్తే వైసీపీ వూరుకుంటుందా. ఈసీ చూస్తూ వదిలేస్తుందా. ఓ విధంగా ఈసీకి ఇది పెద్ద సవాల్. మరి ఏం జరుగుతుందో సోమవారమే తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: