గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాలికతో పాటు ఆమె కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన బాధాకరమని..దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. చట్టాలు తేవడం ఎంతముఖ్యమో..ఆ చట్టాలు అమలు చేయడంలోనూ ప్రభుత్వానికి అంతే చిత్తశుద్ధి ఉండాలన్నారు. 

 

 

ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలి కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ తరఫున రూ.50వేల ఆర్థికసాయం అందజేస్తామన్నారు. బాధితురాలి పేరిట రూ.25 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని.. ఉన్నత చదువు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే ఆ ఖర్చులు భరించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న బాధితురాలి తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వారికి ఇంటిస్థలం కేటాయించాలన్నారు. 

 

 

ఆ తర్వాత అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారిని ఏపీ హోంమంత్రి సుచరిత పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారని.. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. బాలికపై అత్యాచారం జరగడం అత్యంత బాధాకరమని.. దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

 

 

తక్షణ సాయం కింద రూ.5 లక్షల చెక్కును ఆమె అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.5 లక్షలు, చదువు నిమిత్తం రూ.2 లక్షలు, ఫోక్సో చట్టం కింద రూ.25 వేలు, ఎస్సీ,ఎస్టీ అట్రాసీటీ చట్టం కింద రూ.2.50 లక్షలు అందజేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి ఉగాది నాటికి ఇంటి స్థలం కేటాయిస్తామని సుచరిత హామీ ఇచ్చారు. బాలిక తల్లికి డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

 

ఇక్కడ ఒక విషయం గమనించాలి. చంద్రబాబు డిమాండ్ చేసినవన్నీ హోమ్ మంత్రి ఇచ్చేశారు. ఒక్క 25 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్ తప్ప. ఏదేమైనా బాధితురాలిని ఆడుకోవడం కన్నా కావలసింది ఏముంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: