జీవిత లక్ష్యం లేకుండా నేటి యువత రోడ్డుమీద పడి తిరుగుతూ ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి వెంటపడుతూ వారి జీవితాలకు నరకం చూపిస్తున్నారు. ఐతే భారతదేశానికి చీడపురుగుల్లాగా తయారైన ఈ ఆకతాయిల ప్రేమను ఎవరైనా అమ్మాయి ఒప్పుకుంటే... ఇక ఆ అమ్మాయి జీవితం బుగ్గిపాలు అయినట్లే. ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు మగవారిని నమ్మి మోసపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకొని అందరిని విస్తుపోయేలా చేస్తోంది.



వివరాలు తెలుసుకుంటే... గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని చాహారానగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ పదహారేళ్ల బాలికని అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ప్రేమిస్తున్నానని ఆమె వెంట కుక్కలాగా వెంటపడ్డాడు. దీంతో ఆ అమాయకురాలు అతనిపై జాలి దయ చూపించి ఆ తర్వాత అతన్ని స్నేహితునిగా అంగీకరించింది. చివరికి తన గుండెల్లో స్థానాన్ని కూడా ఇచ్చేసింది. దీంతో తన ప్లాన్ వర్కౌట్ అయిందని భావించిన సదరు యువకుడు అమ్మాయి శారీరకంగా వాడుకోవడం ప్రారంభించాడు. అది చాలదన్నట్టు ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలని చిత్రీకరించేవాడు. తన లవర్ వీడియోలు తీస్తున్నా కూడా అభ్యంతరం చెప్పలేదు ఆ అమాయకపు బాలిక. ఇలా వారిద్దరు తరచూ శారీరకంగా కలవడం.. అలాగే ఆ దృశ్యాలను కెమెరాలో బంధించడం చేయడం ప్రారంభించారు.



అయితే ఈ క్రమంలోనే ఒక గుండె పగిలే వార్త సదరు ప్రేమికురాలికి తెలిసి కన్నీరుమున్నీరయింది. ఇంతకీ ఆ గుండె పగిలే వార్త ఏమిటంటే... తాను తన ప్రియుడుతో కలిసి ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఆ ప్రియుడు తన ముగ్గురి స్నేహితులకు వాట్సాప్ చేశాడు. ఐతే ఆ ముగ్గురు స్నేహితులు ఆ వీడియోని వైరల్ చేశారు. ఇది తెలుసుకొని.. ఇన్నాళ్ళు ప్రాణంగా ప్రేమించిన వాడే తన రతిక్రీడలను తన స్నేహితులతో పంచుకునేసరికి ఆ బాలిక తల్లడిల్లిపోయింది.



ఈ దారుణమైన విషయం ఎవరికి చెప్పాలో తెలియక తనలో తాను కుమిలి పోయింది. ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక తీవ్రమైన అవమానంతో తన ఇంట్లో ఉరేసుకొని చచ్చిపోయింది. దీంతో విషయం తీసుకున్న కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ లబోదిబోమంటూ ఏడ్చారు. ఏది ఏమైనా తల్లిదండ్రుల కళ్లుగప్పి పెళ్లి కాకముందే ఓ వ్యక్తితో సెక్స్ చేసి తన చావుకి తానే కారణం అయ్యిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అందుకే రోడ్డు మీద తిరుగుతున్న ప్రతి ఒక్కడి లవ్ ఆక్సెప్ట్ చేయకూడదని, పెళ్లి అయ్యేంత వరకు శ్రద్ధగా చదువుకుంటే సరిపోతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సదరు ప్రియుడితో పాటు అతడి 3 స్నేహితులని ఫోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: