స్ధానిక సంస్ధల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అధికార వైసిపి పై చంద్రబాబునాయుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కంప్లైంట్ చేయబోతున్నారు. తన ఫిర్యాదులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేయబోతారన్న విషయం ఎవరైనా ఊహించవచ్చు. కాబట్టి ఫిర్యాదు చేయటంలో పెద్ద విశేషం ఏమీలేదు. అయితే  కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది ? అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న.

 

నిజానికి ఈ ప్రశ్న వేయనేకూడదు. ఎందుకంటే అధికారపార్టీ మీద ప్రధాన ప్రతిపక్షం ఫిర్యాదు చేసిందంటే ప్రభుత్వం నిజంగా సిగ్గు పడాల్సిన విషయమనటంలో సందేహం లేదు. కానీ ఇపుడు ఫిర్యాదులకే ఎవరైనా సిగ్గు పడుతున్న కాలమా ఇది. ఎందుకంటే గడచిన ఐదేళ్ళల్లో అంటే చంద్రబాబనాయుడు హయాంలో జరిగిన అనేక అంశాలపై అప్పటి ప్రధాన ప్రతిపక్షం  వైసిపి ఎన్నో ఫిర్యాదులు చేసింది. వైసిపి ఫిర్యాదులు చేస్తే చంద్రబాబుకు ఏమన్నా అయ్యిందా ?

 

ఐదేళ్ళ చంద్రబాబు పాలనలో అన్నీ విషయాలను వదిలేసి ఒక్క నంద్యాల ఉప ఎన్నిక విషయాన్ని మాత్రమే తీసుకుందాం. దాదాపు నెల రోజుల పాటు యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నంద్యాలలోనే తిష్ట వేసింది. మంత్రులు, ఎంఎల్ఏలంతా నంద్యాలలోనే క్యాంపు వేశారు. నంద్యాల ఉపఎన్నికలో గెలుపును అత్యంత ప్రతిష్టగా తీసుకున్న చంద్రబాబు అప్పట్లో చేయని అరాచకం లేదు. ప్రతిపక్షాన్ని పెట్టని ఇబ్బంది లేదు.

 

టిడిపి అభ్యర్ధిని గెలిపించుకునేందుకు చంద్రబాబు వందల కోట్ల రూపాయల కుమ్మరించాడు. మద్యం, ఓటర్లకు డబ్బులకు లెక్కే లేకుండా పోయింది. ప్రతి ఓటరుకు టిడిపి నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణి చేస్తున్నట్లు వైసిపి ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులూ, ఎన్నికల కమీషన్ కూడా  పట్టించుకోలేదు. మద్యం, డబ్బులు పంపిణి చేయకుండా వైసిపి నేతలపై చంద్రబాబు ఇంటిలిజెన్స్ అధికారులతో పాటు పార్టీ నేతలను కూడా నిఘా పెట్టాడు.

 

ఉప ఎన్నికల సందర్భంగా స్వేచ్చగా వైసిపి నేతలను చంద్రబాబు ప్రచారం కూడా చేసుకోనీయలేదు. పైగా వివిధ రకాల కేసులు పెట్టి చాలామంది వైసిపి నేతలను అరెస్టులు చేయించాడు. వైసిపి అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ఇంటిపైనే పోలీసులతో అర్ధరాత్రుళ్ళు దాడులు చేయించాడు. శిల్పా కుటుంబానికి చెందిన సొసైటిని మూయించేశాడు. ఇన్ని అరచాకలకు పాల్పడిన తర్వాత కానీ టిడిపి అభ్యర్ధి గెలవలేదు. అప్పట్లో చంద్రబాబు అరాచకాలపై వైసిపి చేసిన ఫిర్యాదులన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. కాబట్టి ఇపుడు చంద్రబాబు చేసినా అంతే అవుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: