కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా దేశ, రాష్ట్రాల కుదేలవుతున్నాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో మొత్తం 21,116 కరోనా మరణాలు సంభవించాయి. ఇక కరోనా పాజిటివ్ కేసులు కూడా 5 లక్షలకు చేరువయ్యాయి. కోవిడ్ మహమ్మారి బారిన పడి ఇటలీ విలవిల్లాడుతుండగా.. స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక భారత్‌లోనూ కరోనా కలకలం రేపుతోంది. దీంతో కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కనిపించని కరోనా పై యుద్ధం చేయడానికి దేశం సిద్ధం అయింది. కరోనా నుంచి రక్షణ కోసం భారత ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని మోడీ. ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. నిత్యావసరాలు తప్ప దాదాపుగా అన్నిరకాల వ్యాపార వ్యవహారాలూ స్తంభించిపోయాయి. అయితే కరోనా కారణంగా మద్యం షాపులు మూసివేయడంతో మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యానికి బాగా బానిసైన మందుబాబులు లాక్‌డౌన్‌తో ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఇక ధైర్యం చేసి బయటకు వెళ్లినా పోలీసులు చితక బాదడంతో మందుబాబులు ఇంట్లో ఉండలేక.. బయటకు వెళ్లలేక నానా తిప్పలు పెడుతున్నారు.
ఇక తాజాగా కేరళలో ఓ మందుబాబు లాక్డౌన్ కారణంగా గత కొన్ని రోజుల పాటు గొంతులో చుక్క పడకపోవడంతో ఏకంగా సూసైడ్ చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. త్రిసూర్ జిల్లాకు చెందిన సనోజ్(35) కు గత వారం రోజుల నుంచి మద్యం లేకపోయే సరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కేరళ వ్యాప్తంగా ఇప్పటికే మందు బాబులు మందు పడక నరాలు జివ్వుమని లాగుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక డీఅడిక్షన్ సెంటర్లో చేరారు. మందుబాబులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి.. వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple