కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా గడగడలాడిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకు పెరుగుతున్న ఈ కరోనా వైరస్ కేసులు అసలు ఏ మాత్రం తగ్గటం లేదు.. ఇప్పటికే ఈ కరోనా బారిన ప్రపంచవ్యాప్తంగా 29 లక్షల 82 వేలమందికిపైగా వ్యాపించింది. ఇంకా అందులో రెండు లక్షలమందికిపైగా మరణించారు. 

 

అయితే ఈ కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు... ఈ కరోనా వైరస్ కారణంగా ఏకంగా కొన్ని లక్షలమంది జీవితాలు మారిపోయాయి.. అయితే అలాంటి మహమ్మారి అయినా ఈ కరోనాని ఓ మూడు నెలల చిన్నారి జయించాడు. ఆశ్చర్యంగా లేదు.. నిజంగానే ఇది చాలా ఆశ్చర్యకరమైన.. ఆనందకరమైన వార్త. 

 

అనుకుంటాం కానీ.. పెద్దవాళ్ళకి కరోనా వస్తే ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పాటిస్తారు.. కానీ అసలు తల్లి ఎవరో? తండ్రి ఎవరో కూడా తెలియని పసి కందులకు కరోనా వైరస్ వస్తే వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు.. పిల్లలు కదా! చూస్తే ముద్దొస్తారు.. కానీ ఏడ్చినా వాళ్ళని పట్టించుకునే వారు కరువవుతారు ఈ కరోనా వైరస్ వస్తే.. 

 

ఇంకా ఇప్పుడు కరోనాని జయించిన మూడు నెలల చిన్నారి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మూడు నెలల బాలుడు కరోనా వైరస్‌ను జయించాడని అధికారులు తెలిపారు. తల్లి పాలతోనే రోగనిరోధక శక్తి పెంచుకొని మహమ్మారి నుంచి కోలుకున్నాడని అధికారులు పేర్కొన్నారు. 

 

అంతేకాదు.. ''ఏప్రిల్ 12న తల్లిబిడ్డలకు పరీక్షలు నిర్వహించగా తల్లికి నెగిటివ్‌, చిన్నారికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ బాలుడికి పాలిచ్చే సమయంలో ఆమెకి గ్లవ్స్‌, మాస్క్‌ ధరించాలని సూచించారు. కరోనా వైరస్ సోకిన తర్వాత చిన్నారికి జ్వరం రాకుండా ఎటువంటి తీవ్ర సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడ్డారు.. అంతేకాదు.. చిన్నారి కేవలం అంటే కేవలం తల్లిపాలతో రోగనిరోధక శక్తి పెంచుకొని చికిత్స లేకుండా బయటపడ్డాడు. ఇంకా నిన్న పరీక్షాలు నిర్వహించగా ఇద్దరికీ నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసినట్టు అక్కడ ఉన్న డాక్టర్ పేర్కొన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: