హైదరాబాద్ నగరం పార్క్ హయత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరియు సుజనాచౌదరి,  కామినేని శ్రీనివాస రావు ల భేటీ ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నాయకులతో అసలు పని ఏమిటి అని వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కుట్రలు చేయటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ప్రభావితం చేస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందువల్ల ఈ భేటీ జరిగినట్లు ఈ భేటీ వెనకాల చంద్రబాబునాయుడు హస్తం ఉన్నట్లు అధికార పార్టీ నేతలు అంటున్నారు.

IHG

ఇప్పటికే ఈ వీడియో విషయంలో ఆ నాలుగో బిగ్ బాస్ ఎవరు అని విజయసాయిరెడ్డి సస్పెన్స్ పెట్టింది చంద్రబాబు గురించి అని చాలామంది భావిస్తున్నారు. చంద్రబాబే ఇలాంటి రాజకీయాలు చేసేది అంటూ చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కూడా ఈ వీడియో ఫుటేజ్ గురించి వ్యాఖ్యానిస్తున్నారు.

IHG

ఏది ఏమైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో మొదటి నుండి వైసిపి పార్టీ చేస్తున్న ఆరోపణలు సీసీ పుటేజ్ ఆధారంగా బయటపడటంతో… తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నట్లు దాదాపు ఈ వీడియో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అర్థమైపోయింది అనే టాక్ గట్టిగా వినబడుతోంది . ఏది ఏమైనా పార్క్ హయత్ హోటల్  ఆధారంగా బయటపడ్డ సీసీ టీవీ ఫుటేజ్ వీడియో దాదాపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాల విషయంలో భారీ డ్యామేజ్ తీసుకు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: