
ఇక ఇలాంటి చేపలు మత్స్యకారుల వలకు చిక్కాయి అంటే ఇక మత్స్యకారులు పండుగ చేసుకోవడం ఖాయం. తాజాగా ఇలాంటి చేపే మత్స్యకారులకు చిక్కింది. దీంతో వారి పంట పండినట్లు అయింది. ఇంతకీ అంత ప్రత్యేకమైన చేపా ఏంటి అని అంటారా... అది ఏంటో తెలుసుకుందాం రండి. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో దోనీదేవుడు అనే మత్స్యకారుడు వేటకు వెళ్లాడు. కానీ అతనికి అదృష్టం ఇంతలా కలిసి వస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. తీరంలో చేపల వేట చేస్తున్న తరుణంలో... అరుదైన చేప అతని వలలో పడింది.
28 కిలోలు ఉన్న కచ్చిలి చేప అతని వలలో చిక్కడంతో అతడు ఎగిరి గంతేసాడు అనే చెప్పాలి. దీనికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంటుంది. ఎంత భారీగా అంటే ఏకంగా లక్షల్లో ఈ చేపలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ చేపను కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరికి అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి 1.70లక్షలకు 28 కిలోల చేపను దక్కించుకున్నాడు. చేప పొట్టు బాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తారని.. అందుకే ఈ చేప కు ఇంత గిరాకీ ఉంటుందని మత్స్యకారులు తెలుపుతున్నారు. ఏదేమైనా ఒక్క చేపతో ఆ మత్స్యకారుడి పంట పండింది అనే చెప్పాలి.