టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీని ఆయన నిలబెట్టుకోవడం అనేది చాలా అవసరం. దీనితో నేతలను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందని ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని అనుబంధ సంఘాల పదవుల విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

అనుబంధ సంఘాలను భర్తీ చేయాలని కొంతమంది నేతలు పట్టుబడుతున్నా సరే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో ముందడుగు వేయడం లేదు. అయితే తెలుగు యువత పదవి విషయంలో ఇప్పుడు చాలావరకు రాజకీయంగా చర్చలు జరుగుతున్నాయి. తెలుగు యువత పదవి ఎవరికి ఇస్తారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే కొంతమంది నేతలు మాత్రం... తెలుగు యువత పదవి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చినా సరే వాళ్ళు ముందుకు రావడం లేదని తెలుస్తుంది.

మరి దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది తెలియదు. కానీ రాయలసీమకు చెందిన ఒక యువనేతకు తెలుగు యువత పదవి ఇవ్వాలని చంద్రబాబునాయుడు భావించిన సరే అందుకు అనుగుణంగా పరిస్థితి కనపడటం లేదు. దీనితో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కి తెలుగుయువత అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. చింతకాయల విజయ్ కాస్త దూకుడు ఉన్న నేత. అందుకే... చంద్రబాబు నాయుడు అతని వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుంది ఏంటి అనేది తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం చంద్రబాబునాయుడు మరికొన్ని అనుబంధ సంఘాలను బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: