తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా రోజులు తర్వాత బయటి సమావేశాలకు బయట చేపట్టే కార్యక్రమాలకు ప్రారంభించడం మొదలైయ్యింది ... కరోనా తర్వాత తొలిసారిగా అయన ఈరోజు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు .. అక్కడ కొన్ని పనులను ప్రారంభించనున్నారు .. మరియు దగ్గర్లోని గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు ... కరోనా తర్వాత చేసే మొదటి పర్యటన కాబట్టి అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది ..

రైతుల సంక్షేమం కోసం ఎల్లపుడు కృషి చేసే  తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటికే రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు చేపట్టిన ప్రభుత్వం ... ఇప్పుడు రైతు వేదికలకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా  ఈరోజు  జనగామ జిల్లా కొడకండ్లలో సీఎం కెసిఆర్  పర్యటించనున్నారు.. పర్యటన సందర్బంగా  అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.  కేసీఆర్ అక్కడ నిర్మించిన రైతు వేదికను లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు జనగామ జిల్లా కొడకండ్ల గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు.

రైతు వేదికల నిర్మాణం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ...రైతులు సమావేశమయ్యేందుకు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఈ రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. రాష్ట్రంలోని 2 వేల 604 క్లస్టర్లలో 573 కోట్ల వ్యయంతో ప్రభుత్వం  రైతు వేదికలను  నిర్మిస్తోంది.

అనంతరం  అదే గ్రామంలోని  పల్లె ప్రకృతివనాన్ని సీఎం కెసిఆర్ సందర్శిస్తారు . ఆ తర్వాత  కొడకండ్ల మండలంలోని రామవరం గ్రామంలో వైకుంఠదామం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలిస్తారు. అటు తరువాత  5వేల మంది రైతులతో సీఎం కేసీఆర్  ముఖాముఖి మాట్లాడతారు. సభ  అనంతరం తిరిగి హైదరాబాద్ పయనం అవుతారు. కాగా, ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ..




మరింత సమాచారం తెలుసుకోండి: