ఇటీవల ఎపీని తుఫాన్ బాగా ఇబ్బంది పెట్టింది. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో భారీగా  ఇబ్బందులు పడ్డారు ప్రజలు. తీవ్రత దెబ్బ ఇంకా గట్టిగానే ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో  ఏపీ సర్కార్ చర్యలు చేపట్టినా సరే ఇంకా సాధారణ పరిస్థితి రాలేదు అని అంటున్నారు. ఇక నివర్ తుపాన్ ప్రాంతాల్లోని టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పాల్గొన్న టిడిపి నియోజకవర్గ బాధ్యులు, ప్రజాప్రతినిధులు పలు వివరాలలు వెల్లడించారు. నివర్ తుపాన్ భీభత్సంలో 114నియోజకవర్గాల్లో పంటలు దెబ్బతిన్నాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు.

3 రోజులైనా పొలాల్లో నీరు వెనక్కి తీయలేదు, పంటలు నీట మునిగి ఉరకెత్తాయి అని ఆయన పేర్కొన్నారు. బుగ్గవంక, పించా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు ఉదంతాలే... వైసిపి చేతగాని పాలనకు ప్రత్యక్ష సాక్ష్యాలు అని మండిపడ్డారు. నీట మునిగిన పంటలను వీడియోలు, ఫొటోలు తీయాలి అని ఆయన సూచించారు. కూలిన ఇళ్లు, దెబ్బతిన్న గృహాలను వీడియోలు, ఫొటోలు తీయాలి ఆదేశించారు.  పంట నష్టం, ఆస్తి నష్టాన్ని డిజిటల్ రికార్డు కింద నమోదు చేయాలి అని ఆయన పేర్కొన్నారు. పేరు, ఊరు వివరాలతో ప్రతి రైతు తనకు జరిగిన పంట నష్టంపై వీడియోలో వెల్లడించాలి అనారు.

దెబ్బతిన్న ఇళ్లను వీడియోల ద్వారా ప్రతి పేద కుటుంబం వెల్లడించాలి అని ఆయన సూచించారు. వాట్సప్ ద్వారా  7557557744 నెంబర్ కు ఆ వీడియోలు, ఫోటోలను పంపాలి అని ఆయన ఆయన పేర్కొన్నారు. వీడియో, ఫొటో ఆధారాలతో సహా స్థానిక అధికారులకు వినతులు అందించాలి అని అన్నారు. విపత్తు బాధితులకు సోషల్ మీడియా కార్యకర్తలు అండగా ఉండాలి అని ఆయన సూచనలు చేసారు. పంట నష్టం, ఆస్తినష్టం సాక్ష్యాధారాల సేకరణలో రైతులు, పేదలకు సహకారం అందించాలి అన్నారు. రైతులకు, పేదలకు అండగా ఉండటం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: