ఈమధ్య కాలంలో టెక్నాలజీ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది అన్న  విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం టెక్నోలజీ వెంట పరుగులు పెడుతుంది. ఈ క్రమంలోనే ఏది కావాలన్నా కూడా అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో దొరుకుతుంది.  రోజురోజుకు తెర మీదకు వస్తున్న అధునాతన టెక్నాలజీని నేటి యువత మంచి కోసం కాకుండా చెడు కోసమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎలాంటి సమాచారం కావాలి అన్న కూడా యూట్యూబ్లో దొరుకుతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఎంతో మంది యువత యూట్యూబ్ లో చూసి ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నారు అయితే కొంత మంది మాత్రం యూట్యూబ్ లో చూసి చివరికి నేరాలకు పాల్పడడం ఎలా అన్న దానిపై ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కొంతమంది యువత యూట్యూబ్లో దొంగతనాలు చేయడం ఎలా.. పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడం ఎలా అన్న విషయంపై కూడా ట్రైనింగ్ తీసుకుని దొంగతనాలు చేసిన ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి. ఇక్కడ  ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 అయితే యూట్యూబ్ లో హ్యాకింగ్  చేయడం ఎలా అని నేర్చుకున్న ఒక యువకుడు ఏకంగా పరాయి వాళ్ళని కాదు తన తండ్రిని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 11 కోట్ల రూపాయలు ఇవ్వక పోతే ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తాను అంటూ కన్నతండ్రి కి వార్నింగ్ ఇచ్చాడు ఇక్కడ ఒక యువకుడు. తండ్రి ఈమెయిల్లో దాచుకున్న ప్రైవేట్ ఫోటోలను ఇక ఈ మెయిల్ ఐడి చెకింగ్ చేసి సంపాదించాడు. ఇక ఆ తర్వాత తండ్రి యొక్క పాస్వర్డ్,ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి కూడా మార్చేశాడు 11 కోట్లు ఇవ్వకపోతే ఆ ప్రైవేట్ ఫోటోలను వైరల్ చేస్తాం అంటూ బెదిరింపులకు దిగాడు.  కానీ చివరికి పోలీసులకు చిక్కి అరెస్టు అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: