ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో కాస్త తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో సీరియస్గా వ్యవహరిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త ఇబ్బందికర రాజకీయం చేస్తున్నారు అనే ఆవేదన గంటా శ్రీనివాసరావు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజికవర్గంలో మంచి పేరున్న గంటా శ్రీనివాసరావు పార్టీ మారితే తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది.

అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు నాయుడు లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దగ్గరలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గంటా శ్రీనివాసరావును దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉన్నా సరే పెద్దగ పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. దీంతో గంటా శ్రీనివాసరావు కూడా కాస్త ఇబ్బందికరంగానే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

గంటా శ్రీనివాస రావు వర్గం త్వరలోనే తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పార్టీ అధినేత వద్ద గంటా శ్రీనివాసరావు మంచి పేరున్న సరే ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ గంట పార్టీ మారితే మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న కీలక నేతలు చాలామంది పార్టీ మారే అవకాశాలు ఉంటాయి. ఇక ఇప్పటికే కొంతమంది నేతలు వైసీపీకి పరోక్షంగా మద్దతు పలికిన సంగతి తెలిసిందే. శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు నాయుడు ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో ఆయన కూడా తన దారి చూసుకునే అవకాశాలు ఉండవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: