ఏపీలో రాజకీయాలు జగన్ పార్టీ ఆవిర్భావం నుండి కొత్త మలుపును తీసుకున్నాయని చెప్పవచ్చు. అప్పటికే ప్రత్యేక తెలంగాణ ఇచ్చేసిన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గింది. కాంగ్రెస్ లో తనకు ప్రాధాన్యత లేకపోవడంతో జగన్ పార్టీ నుండి బయటకు వచ్చేసి వైస్సార్సీపీ ని స్థాపించారు. ఆ తరువాత 2014 లో మొదటి సారి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి తన ఉనికిని చాటుకున్నారు. అయితే 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగేసుకున్నారు. ఇది అప్పట్లో రాజకీయంగా పెద్ద  వివాదాస్పదంగా మారింది. ఈ రాజకీయ క్రీడలో సిబిఐ డీజీ ఏ బి వెంకటేశ్వరావు పాత్ర కీలకమని తెలిసిన విషయమే. అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్ అప్పటి నుండి ఏ బి పై ఓ కన్నేశారు.

తరువాత జరిగిన 2019 ఎన్నికలలో చంద్రబాబుపై విసుగొచ్చి, ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీని అఖండ మెజారిటీతో 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు.  అవకాశం కోసం ఎదురుచూస్తున్న జగన్ ఏ బి వెంకటేశ్వరావు పై జూలు విదిలించారు. తరచుగా రాజకీయాలలో కక్ష పూరితమైన వాతావరణం మనం చూస్తూనే ఉంటాము. రాష్ట్ర స్థాయిలో తన సర్వీసును ముగించుకుని కేంద్ర స్థాయిలో ప్రమోషన్ పై వెళదామనుకున్న ఏ బి వెంకటేశ్వరావు ను చివరి నిమిషంలో జగన్ అడ్డుకున్నారు. దీనితో మొదట అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ఆ తరువాత హై కోర్ట్ మరియు సుప్రీం కోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ సస్పెన్షన్ ను కొనసాగిస్తూ ఉంది సుప్రీం కోర్ట్.

అయితే ఏ బి పరిస్థితి చూసిన వారు మాత్రం అయ్యో పాపం అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి కోసమో తన అధికారాన్ని వాడినందుకు ఈరోజు ఈ విధంగా అనుభవించాల్సి వస్తోంది. ఏ బి ని వాడిసుకున్న టీడీపీ మాత్రం సైలెంటుగా ఉంది. ఏ బి మాత్రం తన లాయర్ ఖర్చులు కోర్టు ఖర్చులు అన్నీ ఆయనే పెట్టుకుంటున్నాడు. ఈ సంఘటన ఆధారంగా ఇప్పుడు ఉన్న ఐఏఎస్ లు కానీ ఐపిఎస్ లు కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, ఎవరి స్వార్ధం కోసమో మన బాధ్యతాయుతమైన అధికారాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉపయోగిస్తే వారికీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: