ఓటీటీ నియంత్ర‌ణ‌కు తీసుకువ‌చ్చిన కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌పై సుప్రీకోర్టు ధ‌ర్మాస‌నం వ్య‌గ్యంగా వ్యాఖ్య‌నించింది.ఓటీటీ నియంత్రణకు మార్గదర్శకాలు కాకుండా చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు. ఓటీటీల నియంత్రణకు ఇటీవల కేంద్రం తెచ్చిన మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. నూతన మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో నియంత్రణ చేయలేవని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం పేర్కొంది. వివాదాస్పద కంటెంట్ వ్యవహారంలో అమెజాన్ ప్రైమ్ అధినేత అపర్ణా పురోహిత్ మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. 'తాండవ్' వెబ్ సిరీస్లో మతపరమైన మనోభావాలన దెబ్బతీశారని యూపీలో దాఖలైన కేసుపై సుప్రీంను ఆశ్రయించారు అమెజాన్ ప్రైమ్ అధినేత. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ దర్యాప్తునకు సహకరించాలని అపర్ణా పురోహిత్ను ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఓటీటీల మార్గదర్శకాలపై ఈ వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.


సామాజిక మాధ్యమాలు, ఓవర్‌-ద-టాప్‌ (ఓటీటీ)లపై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన మార్గదర్శకాల్లో  ప్రాసిక్యూషన్‌కు అధికారాలను క‌ల్పించ‌లేద‌ని ఎత్తి చూపింది.  ఆ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కొన్ని గైడ్‌లైన్స్‌ను సిద్ధం చేసి, సామాజిక మాధ్యమాలపై నియంత్రణకు రూపొందించిన మార్గదర్శకాలతోపాటు కోర్టుకు సమర్పించింది. దీనిపై ధర్మాసనం స్పందించింది. మీరు సమర్పించిన గైడ్‌లైన్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. వాటికి ఏమాత్రం కోరల్లేవు. తప్పు చేసిన ఓటీటీ సంస్థలపై చర్యలకు అవకాశాల్లేవు. ప్రాసిక్యూషన్‌కు అధికారాల్లేవు. ప్రభుత్వం దీన్ని ఓ చట్టంగా తీసుకురావడమే పరిష్కారం. ఈ మార్గదర్శకాలకు సవరణలు చేసి, మరోమారు సమర్పించండంటూ ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.



కొద్దిరోజుల క్రితం తీసుకువ‌చ్చిన డిజిట‌ల్ మీడియా నియంత్ర‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు ఈ విధంగా ఉన్నాయి. అశాంతిని, అవాస్తవాలను కొన్నిసార్లు సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని , ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసే సోషల్ మీడియా రాతలకు అడ్డుకట్ట వేస్తామని  అధికారులు పేర్కొన్నారు. అసత్య, దుష్ప్రచారాలను అడ్డుకునేలా నియంత్రణ తెస్తామని, దీనిలో భాగంగా మూడు నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సోష‌ల్ మీడియా సంస్థ‌లు ఖ‌చ్చితంగా త‌మ అధికారుల‌ను భార‌త్ లో నియ‌మించాలి, భార‌త్ లో వారి కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే అధికారం కూడా దేశంలోనే ఉండాలి. ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: