పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన "వకీల్ సాబ్ " ఏప్రెల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండే ఈ చిత్రం చుట్టూ రాజకీయ వేడి పులుముకుంది. ఏపీ ప్రభుత్వం ఈ చిత్రనికి సంబంధించి బెన్ ఫిట్ షో లకు అనుమతి ఇవ్వకపోవడం, అలాగే టికెట్ దరల పెంపుకు ప్రభుత్వం నిరాకరించడంతో పోలిటికల్ హిట్ మరింత పెరిగింది. దీంతో బీజేపీ నేతలు, జనసేన నేతలు ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం పవన్ సినిమా పై కక్ష పూరిత రాజకీయాలు చేస్తుందంటూ మండి పడ్డారు.

 ఇక జగన్ ప్రభుత్వం కూడా అంతే స్థాయిలో ప్రతివిమర్శలు చేస్తుంది.. ఎవరిని దోచుకోవడానికి టికెట్ ధరలు చెంచాలని డిమాండ్ చేస్తున్నారంటూ మంత్రి పెర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబు మంత్రి పెర్ని నాని పై చేసిన వ్యాఖ్యలు పెను దుమరాన్ని రేపుతున్నాయి. నాగబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.." మీకు ఏమి అయ్యింది నాని గారు. మీరు కారోనా వాక్సిన్ తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి.ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రాబిస్ వాక్సిన్ టూ మిస్టర్ నాని .స్టేట్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పెరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ ". అంటూ మంత్రి పెర్ని నానిపై వ్యంగ్యస్త్రాలు సంధించి తీవ్ర దుమరాన్ని రేపారు నాగబాబు.

 అయితే ఈ వ్యాఖ్యలపై నాని కూడా అంతే స్థాయిలో కౌంటర్ వేశారు. " పరోపకారి పాపన్న నాగబాబు గారు, పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది.అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాను " అంటూ పెర్ని నాని ట్విట్టర్ లో ఘాటు గానే స్పంధించారు. ప్రస్తుతం వీరిద్దరి మద్య జరిగిన ఈ సంభాషణ తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: