దేశంలో కరోనా ఉధృతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజు రోజుకి చాప కింద నీరు లాగా కరోనా దేశం నలుమూలాల వ్యాప్తి చెందుతుంది.అలాగే మరణాలు కూడా చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఒక పక్క కరోనా కేసులతో పాటు మరో పక్క ఆక్సిజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది.చాలా హాస్పిటల్ లో ఆక్సిజన్ లేక ప్రజలు ఊరకనే తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. కరోనాని అదుపు చెయ్యలేక అటు ప్రభుత్వంతో పాటు ఇటు డాక్టర్లు కూడా తలలు ఏం చెయ్యాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కేసులు బాగా పెరిగిపోతున్నాయి.ఇక ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ చాలా అవసరం.ఇక మన ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై ప్రధానికి సిఎం జగన్ లేఖ రాశారు.  కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని సిఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపీకి మంజూరు చేయాలని సిఎం జగన్ లేఖలో కోరారు.  కోవాగ్జిన్  తయారీ దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయిందని, ఈ వ్యాక్సిన్ ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిఎం జగన్ తెలిపారు.


కోవాగ్జిన్ తయారీకి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, ఎన్ఐవీలు కలిసి చేశాయని అన్నారు. తయారీ దారులు ముందుకు వస్తే కోవాగ్జిన్ కోవాగ్జిన్  చేసేందుకు, వారికి టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో సిఎం జగన్ పేర్కొన్నారు. ఎవరైనా వ్యాక్సిన్ ఉత్పత్తికి ముందుకు వస్తే, ప్రజల ఆరోగ్యం నేపథ్యంలో వారిని  ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది.ఏది ఏమైనా కాని జాగ్రత్తలు పాటించడం మరిచిపోవద్దు.మాస్కులు తప్పనిసరిగా ధరించండి..

మరింత సమాచారం తెలుసుకోండి: